మనషులు ఎటుపోతున్నారు..? మనిషిలోని మానవత్వం నిజంగానే మాయమైపోతుందా..? వాయి వరుసలు మర్చిపోయి మనిషి మృగంలా మారిపోతున్నాడా ? అన్న భయం కలుగుతోంది..ఆడపిల్ల కనిపిస్తే చాలు కామంధులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. లేడిపిల్లలా దొరికిన ఆడపిల్లల పట్ల రాక్షసుల్లా మారి ప్రాణాలు హరిస్తున్నారు.. పదునైనా చట్టాలు ఏమి చెయ్యలేక పోతున్నాయి. ఎన్‌కౌంటర్లలో కాల్చి చంపినా భయంలేకుండా పోతోంది. మళ్లీ మళ్లీ చట్టాలు తెచ్చినా మట్టితో సమానమంటున్నారు. శిక్షకు టైమ్ బాండ్ పెట్టి చట్టం చేసినా మమ్ముల్నీ ఏమి చేయలేవన్న ధైర్యం. అందుకే.. అదే విచ్చలవిడి తనం. ఆడ పిల్ల రోడ్డు మీద కనిపిస్తే ఆబోతుల్లా చెలరేగి పోతున్నారు బుద్దిమాలిన బద్మాష్‌గాళ్లు. కామ మధం మత్తులో కామోన్మాదులుగా చెలరేగి పోతూనే ఉన్నారు. ఇక్కడా అక్కడా అని కాదు.. పట్టణాలు, పల్లెలకు తేడా లేదు. ఎక్కడో ఏదో చోట నుంచి రేప్ ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎంత ప్రచారం, ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా మార్పు రావడం లేదు.
ఆడవారిపై జరుగుతున్న అఘాయిత్యాలను అడ్డుకునేందుకు ఒక అడుగు ముందుకేసిన ఏపీ సర్కార్.. నిందితులపై కఠిన శిక్షలు పడే విధంగా దిశ చట్టాన్ని రూపొందించింది. అసెంబ్లీలో ఆమోదం కూడా పొందింది. మరోవైపు మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఊరికో మృగాడు రెచ్చిపోతునే ఉన్నాడు. రేప్ చేస్తే ఉరి శిక్ష ఖాయమంటూ దేశంలోనే తొలిసారిగా ఎపి ప్రభుత్వం దిశ చట్టం విధివిధానాలను విడుదల చేసింది. అదే రోజున గుంటూరు, అనంతపురం, ప్రకాశం జిల్లాలో కామాంధులు మృగాళ్లలా తెగబడ్డారు. ముగ్గురు అమాయకులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామంలో మతిస్ధిమితం లేని యువతిపై దారుణానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. అదే గ్రామానికి చెందిన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రాత్రి 10 గంటల సమయంలో మతిస్ధిమితం లేని, చెవిటి మూగ యువతిపై కామాంధుడు కరుణాకర్‌రెడ్డి ఘాతుకానికి పాల్పడ్డాడు. జరిగిన దారుణాన్ని బాధిత యువతి తల్లిదండ్రులకు తెలిపింది. న్యాయం కోసం తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మతిస్థిమితం లేని మూగ, చెవిటి యువతిపై కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు, యువతి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.
అటు అనంతపురం జిల్లా కదిరిలో మరో ఘోరం జరిగింది. మదర్సాలో చదువుతున్న బాలికపై అత్యాచారం చేయబోయాడు ఓ సెక్యూరిటీ గార్డు. కదిరి టౌన్‌లోని హిందూపురం క్రాస్ సమీపంలో ఉన్న మణప్పురంఫైనాన్స్ ఆఫీస్‌పై మధర్సాను నిర్వహిస్తున్నారు. అయితే.. మధర్సాకు వెళ్తున్న ఎనిమిదేళ్ల చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించాడు సెక్యూరిటీ గార్డు జగదీష్ నాయక్. అక్కడికి వచ్చిన చిన్నారిని బాత్‌రూమ్ దగ్గరికి తీసుకెళ్లి అత్యాచారం చేయబోయాడు. బాలిక అరవడంతో జగదీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. జరిగిన ఘటనను చిన్నారి తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కోసం గాలిస్తున్నారు.
గుంటూరులోనూ మరో కామాంధుడు రెచ్చిపోయాడు. కామంతో కళ్లు మూసుకు పోయిన ఇంటర్ చదివే విద్యార్థి.. ఎల్‌కేజీ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంటిలో టీవీ చూస్తున్న చిన్నారిపై లక్ష్మారెడ్డి అసభ్యకరంగా ప్రవర్తించాడు. రోజు చెలాకిగా ఉండే బాలిక డల్‌గా కనిపించడంతో అమ్మమ్మకు అనుమానం వచ్చింది. లక్ష్మారెడ్డి చేసిన అఘాయిత్యాన్ని చిన్నారి అమ్మమ్మకు చెప్పింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గాయపడిన బాలికను జీజీహెచ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలోనూ ఇటువంటి సంఘటనే చోటుచేసుకుంది. ఓ తల్లి మార్తమ్మ తన మైనర్ కూతురిని బలవంతంగా తన ప్రియుడి తంగిరాల రాంబాబు అనే వృద్ధుడి వద్దకు పంపింది. అతను రాత్రంతా ఆ బాలికకు నరకం చూపించాడు. దీంతో మైనర్ బాలిక తన నానమ్మ వద్ద గోడు వెళ్లబోసుకోగా కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి.. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. తల్లి మార్తమ్మ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపుచర్యలు చేపట్టారు.
ఇటు తెలంగాణలోని హైదరాబాద్‌లోనూ దారుణం చోటు చేసుకుంది. ఈ నెల 8న ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కిన అక్కాచెల్లెళ్లను ఇద్దరు వ్యక్తులు మభ్యపెట్టి దారి మళ్లించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. హైదరాబాద్ లోని హాషామాబాద్‌లో నివసించే ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఐదు రోజుల క్రితం చార్మినార్ వెళ్లేందుకు ఆటో కోసం రోడ్డుపై నిల్చున్నారు. అదే సమయంలో వారివద్దకు వచ్చిన ఆటో డ్రైవర్ మహ్మద్ అమీర్ తాను తీసుకెళ్తానని ఆటో ఎక్కించుకున్నాడు. అనంతరం ఆటో డ్రైవర్‌తో పాటు మరొకరు.. అక్కాచెల్లెళ్లపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇద్దరు బాలికలు కనిపించడం లేదంటూ కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాంపల్లిలో ఇద్దరు బాలికలు ఉన్నట్లు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిద్దర్నీ స్టేషన్‌కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో బాలిక(18) తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పడంతో పోలీసులు మూసాతో పాటు ఆటోడ్రైవర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.