Crime News: దారుణం.. అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసి రక్తాన్ని సమర్పించింది..! తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్..

|

Aug 20, 2021 | 5:59 AM

Crime News: ఎవరైనా గుడికి వెళితే దేవుడికి నైవేద్యంగా ఏం పెడుతారు. పండ్లు, ఫలాలు ఏవైనా తినుబండారాలను పెడుతారు. కానీ కొంతమంది చాలా వింతగా

Crime News: దారుణం.. అమ్మవారికి నైవేద్యంగా గొంతు కోసి రక్తాన్ని సమర్పించింది..! తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాక్..
Woman Suicide
Follow us on

Crime News: ఎవరైనా గుడికి వెళితే దేవుడికి నైవేద్యంగా ఏం పెడుతారు. పండ్లు, ఫలాలు ఏవైనా తినుబండారాలను పెడుతారు. కానీ కొంతమంది చాలా వింతగా ప్రవర్తిస్తారు. మూఢనమ్మకాలతో కోళ్లను, పొట్టేళ్లను బలిస్తారు. మరికొంతమంది ఒక్కడుగు ముందుకేసి తమను తామే బలిచ్చుకుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ఖర్‌ఖోడా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుది గ్రామ అడవీ ప్రాంతంలో మహా భద్రకాళి ఆలయం ఉంది. ఆ గ్రామానికి చెందిన ఓ యువతి అమ్మవారిని నిత్యం భక్తి శ్రద్దలతో ఆరాదించేది. ప్రతిరోజు ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించేది. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ యువతి ప్రవర్తనలో మార్పులు వచ్చాయి. డైలీ గుడికి వెళ్లడంతో ఆమె తనను తాను అమ్మవారి కూతురుగా భావించడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో ఓ రోజున తెల్లవారు జామున ఆలయానికి వెళ్లింది. పూజ చేసిన తరువాత ఊహించని నిర్ణయం తీసుకుంది.

తొలుత గొంతు కోసుకుని ఆ రక్తాన్ని కాళీమాత విగ్రహానికి నైవేద్యంగా సమర్పించింది. గొంతు కోసుకున్న ప్రాంతంలో తీవ్ర గాయం కావడంతో రక్తస్రావమై ఇబ్బంది పడుతూనే గుడి గంటలకు ఉరి తాడు బిగించుకుని ప్రాణ త్యాగానికి పాల్పడింది. పూజారి వచ్చి చూసేసరికి ఆ యువతి గుడి గంటలకు వేలాడుతూ విగత జీవిగా కనిపించింది. దీనితో ఆ పూజారి షాక్‌కు గురయ్యాడు. కొంతసేపటికి తేరుకుని గ్రామస్తులకు, పోలీసులకు సమాచారం అందించాడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అయితే యువతి మృతిపై కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మూఢనమ్మకాల కారణంగా ఆత్మహత్య చేసుకుందా.. లేదంటే ఎవరైనా హత్య చేసి ఇలా క్రియేట్ చేశారా అనేది తేలాల్సి ఉంది. కొంతమంది కుటుంబ సభ్యులతో గొడవ కారణంగా మనస్తాపం చెంది ఆలయానికి వెళ్లి ఉరేసుకుని వుండొచ‍్చని అంటున్నారు. గుడి అడవిలో ఉంది కాబట్టి ఏం జరిగిందో ఎవరికి తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

Satya Ndella: సామాన్యుడు నుంచి మైక్రోసాఫ్ట్ ఛైర్మన్‌గా ఎదిగిన తెలుగు తేజం సత్య నాదెళ్ల పుట్టిన రోజునేడు

అమెరికన్ల తరలింపు పూర్తి అయ్యేంతవరకూ..కాబూల్ లోనే మా బలగాలు. .అమెరికా అధ్యక్షుడు జోబైడెన్

Afghanistan Crisis: తాలిబన్ల చెర నుంచి 62 మంది భారతీయులు సేప్.. కీలకపాత్ర పోషించిన ITBP కమాండోలు..