చాక్లెట్స్‌ ఆశచూపి బాలికను తరచూ బయటకు తీసుకెళ్తున్న యువకుడు.. కొన్ని రోజుల తర్వాత బయటపడ్డ భాగోతం! అసలు ఏం జరిగిందంటే!

డబ్బులు, చిరుతిండ్ల ఆశ చూపి మైనర్‌ బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఘటన ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో వెలుగు చూసింది. రూ.10 ఇచ్చి నిందితుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు గుర్తించిన షీటీం..అతన్ని అరెస్ట్ చేసి పోలీసులకు అప్పగించారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పోక్సో కేసు నమెదు చేశారు.

చాక్లెట్స్‌ ఆశచూపి బాలికను తరచూ బయటకు తీసుకెళ్తున్న యువకుడు.. కొన్ని రోజుల తర్వాత బయటపడ్డ భాగోతం! అసలు ఏం జరిగిందంటే!
Adilabad Incident

Updated on: Jun 24, 2025 | 7:33 PM

కొందరు యువకులు రోజురోజుకూ మరీ దిగజారీ పోతున్నారు. అమ్మాయిలు కనిపిస్తే చాలు, వయస్సుతో సంబంధం లేకుండా తమ వక్రబుద్ది చూపిస్తున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆదిలాబాద్‌ జిల్లాలో వెలుగు చూసింది. అభంశభం తెలియని ఓ పదేళ్ల చిన్నారికి డబ్బు, చిరుతిండ్ల ఆశచూపి ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలసుకున్న షీటీం నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించింది.

వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కళాశాలు, పాఠశాలల్లో విద్యార్థిని, విద్యార్థులు, మహిళలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఎస్పీ ఆదేశాలతో షీటీం బృంధం ఆదిలాబాద్‌లోని వివిధ కళాశాలు, పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే బంగారిగూడలోని ఓ స్కూల్‌లో షీ టీం బృందం మహిళలు, విద్యార్థుల పట్ల గుడ్ టచ్, బ్యాడ్ టచ్ లపై అవగాహన కల్పిస్తోంది. అయితే షీ చెప్పిన విషయాలను గ్రహించిన ఓ విద్యార్థిని తనతో ఓ యువకుడు ప్రవర్తించిన తీరును గుర్తుచేసుకొని షీ టీం బృందాని తెలియజేసింది. వెంటనే దీనిపై స్పందించిన షీ టీం బృందం విద్యార్థిని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు.

బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఓ యువకుడు విద్యార్థినికి ప్రతిరోజు కొంత డబ్బు, బిస్కెట్లు, చాక్లె్ట్స్‌ ఇస్తూ తనను లైంగిక వేధించినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడిపై వన్‌టౌన్‌ పీఎస్‌లో పోక్సో , బీఎన్ఎస్ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని షీ టీం బృందం ఇన్‌ఛార్జి బి.సుశీల స్వయంగా తెలియజేశారు.

అయితే జిల్లాలోని మహిళలు, విద్యార్థినులకు పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ఆదిలాబాద్ షీ టీం బృందం తెలియజేసింది. తమకు మేము అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. ఇలాంటి ఘటనలు ఎక్కడైనా గుర్తిస్తే.. 8712659953 నెంబర్ కి ఫోన్ చేసి షీ టీం సమాచారం అందించాలని కోరింది. సమాచారం అందించిన వారి వివరాలను కూడా తాము గోప్యంగా ఉంచబడతామని.. తమకు ఎలాంటి ఇబ్బందులు కలుగనివ్వమని ఆదిలాబాద్‌ షీటీం బృందం వెల్లడించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..