Crime News: అనంతపురం జిల్లా విషాదం.. ఉమ్మబోయిన ఓ మహిళ ఉపిరే పోయింది..!

|

Nov 21, 2021 | 2:21 PM

అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఉమ్మబోయిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రయాణికులు తల బయటకు పెట్టడంతో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది.

Crime News: అనంతపురం జిల్లా విషాదం.. ఉమ్మబోయిన ఓ మహిళ ఉపిరే పోయింది..!
Died
Follow us on

Woman Died After Spitting: అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. ఉమ్మబోయిన ఓ మహిళ అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. ఓ ప్రయాణికులు తల బయటకు పెట్టడంతో ఎదురుగా వచ్చిన వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి మరణించింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్‌పీ కుంట మండలం ఎదురుదొన పంచాయతీ దాసరివాండ్లపల్లికి చెందిన డేరంగుల శివమ్మ (50) శనివారం ఉదయం రెక్కమానుకు బయలుదేరింది. పల్లెనాయినివారిపల్లి వద్ద ఆటో ఎక్కిన ఆమె గూటిబైలు జెడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలోకి చేరుకోగానే ఉమ్మడానికి తల బయటపెట్టింది. ఆదే సమయంలో ఎదురుగా అతి వేగంగా వచ్చిన బొలెరో వాహనం సైడ్‌ మిర్రర్‌ తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే ఆమె కుప్పకూలి మృతి చెందింది. కాగా, ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై ఎన్‌పీకుంట ఎస్‌ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read Also..  PAN Card Update: పెళ్లయిన తర్వాత పాన్‌లో ఇంటిపేరు, అడ్రస్ మార్చుకోవాలనుకుంటున్నారా..? అయితే ఇలా చేయండి..!