Chennai: చెన్నైలో దారుణం.. కూల్ డ్రింక్ తాగిన క్షణాల్లోనే నీలం రంగులోకి మారిన శరీరం.. ఆ తరువాత..

Chennai: చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగి ఓ మైనర్ బాలిక మృత్యువాత పడింది. షాప్‌లో కొనుగోలు చేసిన..

Chennai: చెన్నైలో దారుణం.. కూల్ డ్రింక్ తాగిన క్షణాల్లోనే నీలం రంగులోకి మారిన శరీరం.. ఆ తరువాత..
Died

Updated on: Aug 05, 2021 | 9:47 AM

Chennai: చెన్నైలో దారుణం చోటు చేసుకుంది. కూల్ డ్రింక్ తాగి ఓ మైనర్ బాలిక మృత్యువాత పడింది. షాప్‌లో కొనుగోలు చేసిన కూల్‌డ్రింక్ తాగి తమ కూతురు మరణించినట్లు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై‌లోని బీసెంట్ నగర్‌కి చెందిన సంతోష్, గాయత్రీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే రెండవ కూతురు ధరణి(13) స్థానికంగా ఉన్న కిరాణా షాప్‌లో కూల్‌డ్రింక్ కొనుక్కుని తాగింది. అది తాగిన ఐదు నిమిషాల వ్యవధిలోనే ధరణి శరీరం అంతా నీలం రంగులోకి మారిపోయింది. దాంతో వెంటనే అప్రమత్తం అయిన బాలిక కుటుంబ సభ్యులు.. ఆస్పత్రికి తరలించారు.

ధరణిని పరిశీలించిన వైద్యులు.. మార్గమధ్యంలోనే చనిపోయినట్లు వెల్లడించారు. అయితే, తమ కూతురు కూల్‌డ్రింక్ కారణంగానే చనిపోయిందంటూ బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే దానిపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు పోలీసులు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ రాగానే.. దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Also read:

పెళ్లికూతురు ఆ సమయంలోనూ పుషప్స్ కొట్టింది..! ఫిట్‌నెస్‌ విషయంలో కచ్చితంగా ఉన్న వధువు…:Viral Video.

అరాచకం టీవీని ఇలా కూడా ఆన్‌ చేస్తారా..?రిమోట్ లేకుండా ఎలా ఆన్ చెయ్యాలో ఇక్కడ చూడండి..:TV Viral Video.

Tirupati Kidnap: యాచకురాలి బిడ్డను అపహరించిన మరో యాచకురాలు.. రెండు రోజులైనా దొరకని ఆచూకీ..

Loading...
Unable to load recommendations.
Follow Us