Viral News: ఉత్తర ప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలోని కైలీలో ఉన్న ఓపెక్ అనే ఆసుపత్రిలో వెలుగు చూసిన ఓ సంఘటన ఒక్కసారిగా భయాందోళనకు గురి చేసింది. చాలా కాలం పాటు పనిచేయకుండా ఉన్న ఓ లిఫ్ట్‌ను తెరిచి చూసేసరికిగుర్తి తెలియని ఓ వ్యక్తి ఆస్థిపంజరం బయటపడింది. సెప్టెంబర్ 1న వెలుగులోకి వచ్చిన ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇంతకీ ఆ ఆస్థిపంజరం ఎవరన్న దానిపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే.. కైలిలో 500 మంచాల సామర్థ్యం ఉన్న ఆసుపత్రి నిర్మాణాన్ని 1991లో ప్రారంభించారు. అయితే ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన లిఫ్ట్ 1997 వరకు పనిచేసింది.. ఆ తర్వాత నిర్వాహణ లేకపోవడంతో ఆగిపోయింది. అప్పటి నుంచి లిఫ్ట్ జోలికి ఎవరూ పోలేదు. ఇదిలా ఉంటే తాజాగా 24 ఏళ్ల తర్వాత ఆసుపత్రి వర్గాలు లిఫ్ట్‌ను ఇటీవల తిరిగి తెరిచేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలోనే లిఫ్ట్ కింద వారికి ఓ ఆస్థిపంజరం లభించింది. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ ఆస్తిపంజరం మగ వ్యక్తిగా తేలింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు డీఎన్‌ఏ పరీక్షకు పంపించారు. ఇక విచారణ ప్రారంబించిన పోలీసుల 24 ఏళ్ల క్రితం తప్పినపోయిన కేసులు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పరిశోధన ప్రారంభించారు.
ఇక ఈ ఆస్థిపంజరంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ ఆ వ్యక్తి లిఫ్ట్‌లో ఇరుక్కు పోవడం వల్ల మరణించాడా.? లేదా ఎవరైనా హత్య చేశారా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. డీఎన్ఏ రిపోర్ట్‌లు వచ్చిన తర్వాతే పూర్తి విషయాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ విషయమై బస్తీ సూపరిండెంట్ దీపేంద్ర నాథ్ చౌదనీ మాట్లాడుతూ.. ‘ఈ కేసు విషయమై ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తాం. ప్రస్తుతం ఈ మిస్టరీని చేధించడానికి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నాం. ఈ ఆస్థిపంజరం ఎవరిదనే విషయాన్ని తెలుసుకునేందుకు గాను జిల్లా వ్యాప్తంగా ఉన్న 24 స్టేషన్లకు చెందిన పోలీసులు రంగంలోకి దిగారు’ అని చెప్పుకొచ్చారు.
#BastiPolice थाना कोतवाली क्षेत्र अन्तर्गत दिनांक 01.09.2021 को कैली हॉस्पिटल के लिफ्ट में मिले नर कंकाल के सम्बन्ध में अपर पुलिस अधीक्षक बस्ती श्री दीपेन्द्र नाथ चौधरी द्वारा दी गई बाईट- pic.twitter.com/x9l256yS5P
— BASTI POLICE (@bastipolice) September 2, 2021
Also Read: