పాలమూరు జిల్లాలో దారుణం..! చిన్న పిల్లాడని చూడకుండా కడతేర్చారు కర్కోటకులు.. కిడ్నాప్ గురైన బాలుడి దారుణ హత్య..!

|

Feb 24, 2021 | 2:27 PM

రెండు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన చిన్నారి... చివరకు శవమై కనిపించాడు. మహబూబ్‌ నగర్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది.

పాలమూరు జిల్లాలో దారుణం..! చిన్న పిల్లాడని చూడకుండా కడతేర్చారు కర్కోటకులు.. కిడ్నాప్ గురైన బాలుడి దారుణ హత్య..!
Follow us on

Boy murder after kidnap : ఆ చిన్నోడి ఆర్తనాదాలు కూడా వారి మనుసును కరిగించలేకపోయాయి. రెండు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన చిన్నారి… చివరకు శవమై కనిపించాడు. మహబూబ్‌ నగర్ జిల్లాలో ఈ దారుణం వెలుగుచూసింది. ఈఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట మండలం జానంపేటలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌ అయిన ఎనిమిదేళ్ల బాలుడు… శవమై బావిలో తేలాడు. ఎనిమిదేళ్ల చిన్నారిని హతమార్చిన దుండగులు.. అనంతరం మృతదేహాన్ని బట్టలో చుట్టి గ్రామానికి సమీపంలోని ఓ బావిలో పడేసి, పారిపోయారు. తమ కుటుంబం అంటే గిట్టని వారే ఈ దారుణం చేశారని బాలుడి తండ్రి అంటున్నాడు.

జానంపేట గ్రామానికి చెందిన విష్ణు కుమారుడు సతీష్ అనే ఎనిమిదేళ్ల బాలుడు రెండు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురయ్యాడు. దీంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంతలో దుండగులు ఆ బాలుడిని ఉరివేసి హతమార్చారు. అనంతరం బుట్టలో చుట్టేసి బావిలో పడేసి పారిపోయారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండిః  మాకు కట్నం వద్దు, మీ కూతుర్ని ఇవ్వండి చాలు, రాజస్తాన్ లో 11 లక్షల సొమ్మును తిరిగి ఇచ్ఛేసిన రిటైర్డ్ ప్రిన్సిపాల్