Ganja Smuggling: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ ఎత్తున గంజాయి పట్టుబడింది. దీని విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆదివారం తనిఖీలు నిర్వహిస్తుండగా గంజాయి అక్రమ రవాణా స్కాం బయటపడ్డట్లు పోలీసులు వెల్లడించారు. 8 క్వింటాళ్ల గంజాయిని విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం గోచెక్క గ్రామం వద్ద ఆదివారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా.. వాహనాల రికవరీ వ్యాన్‌పై అనుమానం వచ్చిందని పోలీసులు వెల్లడించారు. దానిని క్షణ్ణంగా పరిశీలించగా.. వాహనంలోని అరల్లో గంజాయి మూటలు బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ 800 కిలోల గంజాయిని విశాఖ ఏజెన్సీ ప్రాంతం నుంచి ఒడిశా రాష్ట్రం అలమండ మీదుగా బీహార్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
అనుమానం రాకుండా అయిదు కిలోల చొప్పున కట్టలు కట్టి, బస్తాలతో అరల్లో దాచినట్లు పోలీసులు వెల్లడించారు. దీనికి సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పార్వతీపురం సీఐ లక్ష్మణరావు వెల్లడించారు. వెహికల్స్ రికవరీ వాహనం కింది భాగంలో అరల్లో అమర్చి.. స్మగ్లర్లు చాకచక్యంగా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్నారన్నారు. పక్కా సమాచారంతో స్మగ్లర్లను రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Also Read: