SBI Fraud: ఏ చిన్న సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్‌లో సెర్చ్ (Google Search) చేయడం ఒక అలవాటుగా మారిపోయింది. తెలిసిన సమాచారమైనా ఓసారి గూగుల్‌లో క్రాస్ చెక్ చేసుకుందామనే రోజులు వచ్చేశాయి. అయితే గుడ్డిగా గూగుల్‌ను నమ్మితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. అడిగిన సమాచారం అందించే గూగుల్ ఎన్నో సైబర్ మోసాలకు (Cyber Crime) కూడా కారణంగా మారుతుందని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతున్నాయి. తాజాగా గూగుల్‌ను నమ్మి కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే ఓ వ్యక్తి ఏకంగా రూ. 5 లక్షలు పోగోట్టుకున్నాడు. ఈ సంఘటన ముంబయిలో తాజాగా చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే… నవీ ముంబయికి చెందిన ఓ 73 ఏళ్ల వృద్ధుడు ఇటీవల ఎస్‌బీఐ డెబిట్ కార్డును అప్లై చేసుకున్నాడు. తీరా డెబిట్ కార్డును యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఎస్‌బీఐ కస్టమర్ కేర్‌కి కాల్ చేయాలనుకున్నాడు. ఇందులో భాగంగానే గత డిసెంబర్‌లో గూగుల్‌లో ఎస్‌బీఐ కస్టమర్ కేర్ నెంబర్ కోసం సెర్చ్ చేశాడు. రిజల్ట్స్‌లో వచ్చిన ‘ఎస్‌బీఐ డెబిట్ కార్డ్ హెల్ప్’ అని ట్యాగ్ చేసిన నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో అవతలి వ్యక్తి అచ్చంగా ఎస్‌బీ ఉద్యోగిలాగే మాట్లాడడం ప్రారంభించాడు. డెబిట్ కార్డు యాక్టివేట్ చేసుకోవడం కోసం కాల్ చేశానని చెప్పడంతో… ఎస్‌బీఐ ఉద్యోగిలా మాట్లాడుతున్న ఆ మోసగాడు తన ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాడు.
ఇందులో భాగంగానే ఫోన్‌కు రిమోట్ యాక్సెస్ అవసరం పడుతుందని, సదరు బాధితుడితో ఫోన్‌లో ఎనీ డెస్క్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించాడు. దీంతో బాధితుడి అకౌంట్ డీటెయిల్స్‌ను సేకరించాడు. అనతరం సర్వర్ స్లోగా ఉందని మూడు రోజుల్లో డెబిట్ కార్డు యాక్టివేట్ అవుతుందని చెప్పి కాల్ కట్ చేశాడు. తీరా చూస్తే సదరు డెబిట్ కార్డు నుంచి మొత్తం మూడు ట్రాన్సాక్షన్స్‌లో రూ. 4.02 లక్షలను కొట్టేశాడు. దీంతో డబ్బులు కట్ అయ్యాయని తెలుసుకున్న బాధితుడి పోలీసులను ఆశ్రయించడంతో తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. చూశారుగా గూగుల్ ఉంది కదా అని ఏది పడితే అది వెతికితే ఎలాంటి మోసాలు జరగొచ్చే. కాబట్టి వీలైనంత వరకు అధికారిక వెబ్‌సైట్‌లలో ఉండే సమాచారాన్నే విశ్వసించాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mangoes: మామిడి రైతులకు గుడ్ న్యూస్.. కేంద్రం కీలక నిర్ణయం
Mahabubabad: భార్యాభర్తల మధ్య గొడవ.. ఒకే కుటుంబంలో ముగ్గురి ప్రాణాలు బలి.!
Hyderabad: కరోనా విలయతాండవం.. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్యులకు పాజటివ్..