Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..

|

Sep 18, 2021 | 10:44 PM

7 girls drown in pond: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్మ పూజ కోసం చెరువు దగ్గర వెళ్లిన ఏడుగురు బాలికలు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన

Tragedy: విషాదం.. చెరువులో పడి ఏడుగురు బాలికలు మృత్యువాత.. పూజల కోసం వెళ్లి..
Girls Drown In Pond
Follow us on

7 girls drown in pond: జార్ఖండ్‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కర్మ పూజ కోసం చెరువు దగ్గర వెళ్లిన ఏడుగురు బాలికలు నీటిలో మునిగి మృత్యువాతపడ్డారు. ఈ దుర్ఘటన జార్ఖండ్‌లోని లతేహార్‌ జిల్లాలో చోటుచేసుకుంది. సాంప్రదాయ పండుగ ‘కర్మ పూజ’ కోసం వెళ్లిన సమయంలో ఈ విషాదకర సంఘటన జరిగింది. లతేహార్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బలుమఠ్‌ బ్లాక్‌లోని షేర్‌గఢ్‌ పంచాయతీ పరిధిలోని బుక్రు గ్రామానికి చెందిన పది మంది బాలికలు గిరిజన పండుగ ‘కర్మ పూజ’ జరుపుకునేందుకు గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు ఇద్దరు బాలికలు చెరువులో పడి మునిగిపోయారు. ఈ క్రమంలో రక్షించాలంటూ కేకలు వేయడంతో వారిని కాపాడేందుకు.. మరో ఐదుగురు బాలికలు నీటిలోకి దిగారు. ఈ క్రమంలో వారు కూడా మునిగిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనలో నలుగురు బాలికలు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు బాలుమఠ్‌ ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు అక్కాచెళ్లెల్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల వయస్సు 12 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని పేర్కొన్నారు. వీరంతా స్థానిక పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన అనంతరం న్యాయం చేయాలని మృతుల కుటుంబసభ్యులు, గ్రామస్తులు 98వ జాతీయ రహదారిపై బైఠాయించారు.

ఇదిలాఉంటే.. ఈ ఘటనపై జార్ఖండ్ సీఎం హేమంత్‌ సోరెన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెరువులో మునిగి ఏడుగురు మృతి చెందారన్న వార్తతో దిగ్భ్రాంతికి గురయ్యాయని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. బాధిత కుటుంబాలకు ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు హేమంత్ సోరెన్ ట్వీట్‌ చేశారు.

Also Read:

Crime News: ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యక్తి సజీవ దహనం.. వెళ్తున్న కారులో..

CLW Recruitment: ఐటిఐ అర్హత ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రాతపరీక్ష లేకుండానే టెన్త్ మార్కులతో ఉద్యోగవకాశాలు