Old man rapes minor girl: దేశంలో నిర్భయ లాంటి చట్టాలు ఉన్నప్పటికీ.. మానవ మృగాలు రెచ్చిపోతున్నాయి.. తాజాగా ఓ వృద్ధుడు మనమరాలి వయసు ఉన్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కనికరం లేకుండా చిన్నారిని ఇష్టం వచ్చినట్లు కొట్టి బలవంతంగా తన వాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణ సంఘటన మంగళవారం మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని ఒక గ్రామంలో 12 ఏళ్ల బాలికపై వృద్ధుడు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. 65 ఏళ్ల నిందితుడికి ఐదుగురు పిల్లలు, మనవళ్లు కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం పరారైన వృద్ధుడిని అర్ధరాత్రి అరెస్ట్ చేసినట్లు బద్నాపూర్ పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.
బాధితురాలు మేనమామ ఇంట్లో ఉండేదని పోలీసులు తెలిపారు. అయితే మంగళవారం బాలిక ఇంట్లో ఉన్న కోళ్లకు మేత వేస్తుండగా.. దగ్గరకు వచ్చిన నిందితుడు.. బలవంతంగా లాక్కెళ్లాడు. అనంతరం చిన్నారిని కొట్టి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు వివరించారు. అనంతరం ఊరు వదిలి పారిపోయాడని తెలిపారు. ఈ ఘటన అనంతరం బాధితురాలు తన మేనమామకు జరిగిన విషయాన్ని వెల్లడించగా.. అతను ఫిర్యాదు చేసినట్లు పోలీసులు వివరించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం పంపించారు. నివేదిక అనంతరం వృద్ధుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read: