
అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక 6 నెలల గర్భిణి ఆత్మహత్య చేసుకుంది. జిల్లాలోని అమరాపురం మండలం.. నిద్రగట్ట గ్రామంలో ఈ విషాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన శోభా అనే 21 సంవత్సరాల యువతి.. అత్తింటి వేధింపులు తట్టుకోలేక తనువు చాలించింది.
ఆత్మహత్యకు ముందు తన చావుకు కారణం భర్త, అత్తమామలు, తోటికోడల్లు, బావ, మరిది కారణమని మొబైల్ ఫోన్లో కన్నడ భాషలో రికార్డు చేసి ఫేస్‌బుక్‌లో ఫోస్ట్ చేసింది. అవే విషయాలను సూసైడ్ లెటర్‌లో కూడా ప్రస్తావించింది. ఇబ్బందులు పెట్టినవాళ్లు.. తన మరణాంతరం ఇబ్బందులు ఎదుర్కోవాలని సెల్ఫీ వీడియో కూడా రికార్డు చేసింది. మృతిరాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా శోభకు రెండు సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం ఆమె 6 నెలల గర్భవతి. స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Also Read:
నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..
విషాద ఘటన.. టీవీ చూస్తుంటే అమ్మ మందలించింది.. అమ్మాయి ఆత్మహత్య