
వివరాల్లోకి వెళ్లితే…! ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లాకు చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తికి ఇంద్రావతి అనే మహిళతో కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే ఇది చంద్రశేఖర్‌కు రెండో వివాహనం అని తెలుస్తోంది. అయితే చంద్రశేఖర్ పని నిమిత్తం తరచూ క్యాంపులకు వెళ్లేవాడు. ఇక భార్య ఇంట్లో ఉండేది. ఇక బంధుత్వం పరంగా మనవడు వరసయ్యే ఆజాద్ కూడా అక్కడే నివసించేవారు. ఈ నేపథ్యంలో ఆజాద్ అప్పుడప్పుడూ ఇంద్రావతి వాళ్ల ఇంటికి వచ్చేవాడు. దీంతో వారి మధ్యనున్న బంధుత్వం క్రమంగా ప్రేమగా మారింది. అయితే, వారి మధ్య ఏజ్ గ్యాప్, బంధుత్వం కారణంగా వారిని ఎవరూ అనుమానించలేదు. అలా కొన్నాళ్లు వీళ్లు ప్రేమాయనం సాగించారు.
అయితే క్యాంప్ నుంచి ఇంటికి వచ్చిన భర్త చంద్రశేఖర్, ఇంద్రవతి-అజాద్ రహస్యంగా మాట్లాడుకుంటుండగా చూశాడు. అనుమానంతో వాళ్ల ఇద్దరి పట్టుకొని నిలదీశాడు. దీంతో వారిమధ్యనున్న సంబంధం గురించి తెలుసుకుని షాక్ అయ్యాడు. వారిద్దరినీ విడదీసేందుకు పలు మార్లు ప్రయత్నించాడు. దీంతో ఇక అక్కడ కలిసి ఉండలేమని గ్రహించిన.. ఇంద్రవతి-అజాద్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. గ్రామం సమీపంలోని గోవింద్ సాహిబ్ ఆలయానికి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గ్రామం నుంచి పరారయ్యిరు.
విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ పోలీసులను ఆశ్రయించాడు. అయితే, వాళ్లిద్దరూ పెద్దలు కావడంతో పోలీసులు చంద్రశేఖర్ ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ మరో దారుణమైన విషయాన్ని బయటపెట్టాడు. ఇంద్రావతి తన రెండో భార్య అని… తనతో పాటు పిల్లలకు విషమిచ్చి చంపేందుకు ఆజాద్‌లో కలిసి ఇంద్రావతి కుట్ర చేసిందని ఫిర్యాదు చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…