ముంచేసిన వీకెండ్ సరదా.. బంధువుల ఇంటికొచ్చి.. వెలిగల్లు ప్రాజెక్టులో నలుగురు గల్లంతు..

|

Aug 08, 2021 | 2:40 PM

Veligallu Project: ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం నెలకొంది. బంధువుల ఇంటికొచ్చిన నలుగురు వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో

ముంచేసిన వీకెండ్ సరదా.. బంధువుల ఇంటికొచ్చి.. వెలిగల్లు ప్రాజెక్టులో నలుగురు గల్లంతు..
Crime News
Follow us on

Veligallu Project: ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బంధువుల ఇంటికి వచ్చిన నలుగురు వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగులో గల్లంతయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని గాలివీడు మండలం వెలిగల్లు ప్రాజెక్టు సమీపంలోని గండి మడుగు వద్ద చోటుచేసుకుంది. గల్లంతైన వారంతా కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరుకు చెందిన 10 మంది బృందం విహారయాత్ర కోసం కొన్ని రోజుల క్రితం బయలుదేరారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని బంధువుల ఇంటికి వచ్చారు.

అనంతరం అక్కడి నుంచి మరో 10 మందితో కలిసి మొత్తం 20 మంది వెలిగల్లు ప్రాజెక్టుకు చేరుకుని సరదాగా ఫొటోలు తీసుకుంటూ గడిపారు. ఈ తరుణలోనే ఆడుకుంటూ దిగువనున్న గండి మడుగులోకి సరదాకు ఈతకు వెళ్లారు. గండి మడుగులో లోతు ఎక్కువగా ఉండటంతో.. ఈతకు వెళ్లిన వారిలో నలుగురు గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

అనంతరం సంఘటన స్థలానికి చేరుకున్న లక్కిరెడ్డిపల్లి సీఐ యుగంధర్‌, ఎస్ఐ పలు వివరాలను సేకరించారు. గజ ఈతగాళ్లతో గండిమడుగులో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. గల్లంతైన వారిని బెంగుళూరుకు చెందిన తాజ్‌ మహ్మద్‌(40), మహ్మద్‌ హంజా(12), ఉస్మాన్‌ ఖానమ్‌(11), మహ్మద్‌ హఫీజ్‌(10)లుగా పోలీసులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి : చిన్నారి ప్రాణాల మీదకొచ్చిన తల్లిదండ్రుల మధ్య గొడవ.. కన్నబిడ్డను మేడ పైనుంచి విసిరేసిన తల్లి

Gupta Nidhulu: ధనవంతులుగా మారండి.. ఆ గుప్తనిధులు మీ సొంతం కావచ్చు.. మాటల మాంత్రికులకు మోత మొగింది..