హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిమ్లాకు సమీపంలోని ఖలిని ప్రాంతంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్ధులతో పాటు.. బస్సు డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఏడుగురు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలోనే బస్సు డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడని.. ముగ్గరు విద్యార్ధులు ఆస్పత్రిలోకి తరలించే సమయంలో ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు ఉత్తరాఖండ్‌లో గత రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. మలారిలో కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఐటీబీపీ, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.