Afghanistan: మసీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి.. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఘటన

|

Aug 18, 2022 | 6:47 AM

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో భారీ ప్రమాదం జరిగింది. దేశ రాజధాని కాబుల్ లోని ఓ మసీదులో భారీ పేలుడు (Bomb Blast) సంభవించింది. మసీదులో ఈ బాంబు దాడి జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది...

Afghanistan: మసీదులో భారీ పేలుడు.. 20 మంది మృతి.. ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఘటన
Blast
Follow us on

అఫ్గానిస్థాన్ (Afghanistan) లో భారీ ప్రమాదం జరిగింది. దేశ రాజధాని కాబుల్ లోని ఓ మసీదులో భారీ పేలుడు (Bomb Blast) సంభవించింది. మసీదులో ఈ బాంబు దాడి జరిగింది. ఈ ఘోర దుర్ఘటనలో 20 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 40 మంది గాయపడినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులను కాబూల్‌లోని ఎమర్జెన్సీ హాస్పిటల్ కు తరలించారు. కాగా వీరిలో ఐదుగురు పిల్లలు కూడా ఉన్నారు. కాబూల్ నగరంలోని సార్-ఎ-కోటల్ ఖైర్ఖానాలో పేలుడు జరిగింది. కాబూల్ భద్రతా విభాగం ఖలీద్ జర్దాన్ పేలుడును ధృవీకరించారు. ప్రస్తుతం భద్రతా బలగాలు పేలుడు స్థలానికి చేరుకున్నాయి. ఆ ప్రాంతమంతా తాలిబాన్ సెక్యూరిటీ గార్డులతో మూసివేశారు. బాధితులకు సహాయం అందిస్తూ రక్షణ చర్యలు చేపడుతున్నారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి