
Adilabad Road Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతిచెందారు. మరో 14 మందికి గాయాలయ్యాయి. వీరిలో కొంతమందికి తీవ్రగాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు. శనివారం ఉదయం జిల్లాలోని ఇచ్చోడ మండలం ఇస్లాంనగర్ శివారులో ఈ ఘటన జరిగింది. నాగ్‌పూర్ నుంచి వాహనం హైదరాబాద్‌కు వస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించినట్లు పేర్కొన్నారు. క్షతగాత్రులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కూలీలుగా పోలీసులు గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: