జొమాటో ఉద్యోగులపై వేటు.. !

కోవిడ్ 19 ప్రభావంతో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. కరోనా సంక్షోభం తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై పడింది. సంస్థలో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉద్యోగుల తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు భారంగా మారడంతో 600 మందికిపైగా ఉద్యోగులను […]

జొమాటో ఉద్యోగులపై వేటు.. !
Follow us

|

Updated on: May 15, 2020 | 6:56 PM

కోవిడ్ 19 ప్రభావంతో ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోంది. కరోనా సంక్షోభం తాజాగా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటోపై పడింది. సంస్థలో పనిచేస్తున్న 600 మందికి పైగా ఉద్యోగుల తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల్లో 13 శాతం మందిని తొలగిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడ్డాయి. దీంతో ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపు భారంగా మారడంతో 600 మందికిపైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ఉద్యోగుల వేతనాల్లోనూ 50 శాతం కోత విధించారు. తొలగించిన ఉద్యోగులకు సంస్థ ఆర్థిక సహాయం చేస్తుందని.. కొత్తగా ఉద్యోగాలు పొందడానికి జొమాటో సాయం చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ దీపిందర్ గోయల్ ఉద్యోగులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. జొమాటో వ్యాపారంపై లాక్‌డౌన్‌ తీవ్ర ప్రభావం చూపిందని, తప్పని పరిస్థితుల్లో కిరాణా సరుకులు డెలివరీ చేయాల్సి వస్తోందన్నారు. జూన్ 1 నుంచి సంస్థలోని ఉద్యోగులందరి వేతనాల్లో తాత్కాలికంగా కోతలు ఉంటాయని ప్రకటనలో పేర్కొన్నారు.