ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ.. రికార్డు స్థాయిలో కేసులు..

Edited By:

Updated on: Jul 19, 2020 | 11:52 AM

ప్ర‌పంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజురోజుకీ కరోనా వైరస్ మహమ్మారి వికృత రూపం దాల్చుతోంది. ఈ వైరస్ దెబ్బకు ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలమయ్యాయి. రోజురోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య‌, మరణాల సంఖ్య‌ పెరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్ప‌టికే ఈ వైర‌స్ బారిన ప‌డి ప‌లువురు ప్ర‌ముఖులు కన్నుమూసిన విష‌యం తెలిసిందే. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా నిన్న 2,17,257 మందికి కోవిడ్ సోకడంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,44,07,643కి చేరుకుంది. కాగా కరోనాతో మొత్తం ఇప్పటివరకూ 6,04,103 మంది మరణించారు. ఇక ప్రస్తుతం 52,17,577 యాక్టీవ్ కేసులు ఉండగా, 85,85,963 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో క‌రోనా వైర‌స్ ఉగ్ర‌రూపం దాల్చుతోంది. రోజురోజుకీ కొత్తగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తాజాగా 61,668 కరోనా కసులు నమోదయ్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కూ దేశ వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 38,31,680కు చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ 1,42,861 మంది మృతి చెందారు. కాగా అమెరికాలో ఇంత భారీ స్థాయిలో కేసులు న‌మోదు కావ‌డం ఇదే మొద‌టి సారి. ఇక బ్రెజిల్, రష్యా, జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, స్పెయిన్, లండన్, పాకిస్తాన్, ఇటలీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

అలాగే భారత్​లో కరోనా వ్యాప్తి తీవ్ర‌త‌రం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 24 గంటల్లో అత్యధికంగా రికార్డు స్థాయిలో 38,902 కరోనా పాజిటివ్​ కేసులు నమోదవ్వగా, 543 మంది కోవిడ్ కార‌ణంగా మరణించారు. కాగా దేశ‌వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618గా ఉంది. ప్ర‌స్తుతం దేశంలో 3,73,379 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక వ్యాధి నుంచి కోలుకుని 6,77,423 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశం మొత్తం కరోనాతో మృతుల సంఖ్య 26,816కి చేరుకుంది.

Read More:

రేఖాజీ కోవిడ్ టెస్ట్ చేయించుకోండి.. ముంబై మేయ‌ర్ విన‌తి

టీటీడీ అనుబంధ ఆలయాల్లో కలకలం పుట్టిస్తోన్న కరోనా..

బ్రేకింగ్: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రజత్ ముఖర్జీ మృతి