క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందే..! అందుకే ఇలా..

|

May 14, 2020 | 1:03 PM

క‌రోనా నుంచి త‌మ‌ను తాము కాపాడుకుంటూనే జీవ‌నోపాధిని కొన‌సాగిస్తున్నారు కొంద‌రు..

క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందే..! అందుకే ఇలా..
Follow us on
క‌రోనాతో క‌లిసి జీవించాల్సిందేన‌ని ఇప్ప‌టికే దేశ‌ప్ర‌ధాని స‌హా ప‌లు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూ హెచ్‌వో) కూడా ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేసింది. కరోనా వైరస్ ఎప్పటికీ అంతం కాదని పేర్కొంది.

హెచ్ఐవీ లాగే ఇదీ ఎప్పటికీ మానవాళిని విడిచిపోదని డబ్ల్యుహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైక్ రాన్ అభిప్రాయపడ్డారు. కరోనాకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టే వరకూ ఇది మనవాళికి ముప్పుగానే ఉంటుందన్నారు. వ్యాక్సిన్ కోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అప్ప‌టివ‌ర‌కు స‌రైన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌వ‌ని సూచించారు.ఈ క్ర‌మంలోనే సాధార‌ణ ప్ర‌జ‌లు కూడా అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

భార‌త్‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఉధృతి కొన‌సాగుతోంది. అత్య‌ధిక పాజిటివ్ కేసుల‌తో మ‌హారాష్ట్ర మొద‌టి స్థానంలో ఉండ‌గా, రెండో స్థానంలో గుజ‌రాత్ నిలిచింది. అయితే, క‌రోనా నుంచి త‌మ‌ను తాము కాపాడుకుంటూనే జీవ‌నోపాధిని కొన‌సాగిస్తున్నారు కొంద‌రు సెలూన్ షాప్ ఓన‌ర్లు. గుజరాత్‌లోని నడియాడ్‌ పట్టణంలోని హెయిర్‌ స్టెలిస్టులు పీపీఈ(పర్సనల్‌ ప్రొటక్టివ్‌ ఎక్యూప్‌మెంట్‌) కిట్లు ధరించి కస్టమర్లకు కటింగ్‌ చేస్తున్నారు. కస్టమర్లు సైతం ఫేస్‌ మాస్క్‌ తప్పనిసరిగా వినియోగాంచాల్సిందేన‌ని సూచ‌న‌లు పెట్టారు. సెలూన్‌లో భౌతిక దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం సూచించిన అన్ని జాగ్రత్త చర్యలు పాటిస్తూ తాము పనిచేసుకుంటున్నట్లు సెలూన్ నిర్వాహ‌కులు చెబుతున్నారు.