అవసరమున్న ప్రతీ భారతీయుడికి కరోనా వ్యాక్సిన్… కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ ప్రకటన…
దేశంలో టీకా అవసరమైన ప్రతి ఒక్కరికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ తాజాగా ప్రకటించారు.

కరోనా టీకా మరికొద్ది రోజుల్లో అందుబాటులోకి రానుంది. భారత ప్రభుత్వం వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. కరోనా నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు పక్కా ప్రణాళికలను రచిస్తోంది. టీకాను తీసుకురావడం, స్టోర్ చేయడం, ప్రజలకు అందించడం ఇలా అన్ని కోణాల్లోనూ కేంద్రం ముమ్మర ఏర్పాట్లను చేస్తోంది.
Every single Indian who needs to be vaccinated will be vaccinated
Prioritized Population Groups include ✅About 1 crore #HealthcareWorkers ✅About 2 crore #FrontlineWorkers ✅About 27 crore in the Prioritized Age Grp (aged above 50 yrs & those with co-morbidities) : @MoHFW_INDIA pic.twitter.com/nR0Ewsnojj
— PIB in Maharashtra ?? (@PIBMumbai) December 8, 2020
వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను పరిశీలించడానికి ప్రభుత్వం ఓ యాప్ క్రియేట్ చేసిందని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ చెప్పారు. డిసెంబర్ 8న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ యాప్ పేరు Co-WIN. ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్ (eVIN)కి ఇది అప్‌గ్రేడెడ్ వెర్షన్. వ్యాక్సిన్ ప్రక్రియలో భాగమయ్యే ప్రతి ఒక్కరికీ ఈ యాప్ ఉపయోగపడుతుంది. అడ్మినిస్ట్రేటర్లు, వ్యాక్సినేటర్లు, వ్యాక్సిన్ అందుకునే వాళ్లు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మొదటి, రెండో దశల్లో ఈ వ్యాక్సిన్‌ను ఆరోగ్య కార్యకర్తలు, కరోనాపై పోరాడుతున్న ఇతర ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు ఇవ్వనున్నారు.
ఇప్పటికే వాళ్లకు డేటా మొత్తం కేంద్రం సేకరించింది. మొదటి దశలో ఆరోగ్య కార్యకర్తలకు, రెండో దశలో ఎమర్జెన్సీ వర్కర్లకు ఇస్తారు. మూడో దశలో కరోనా ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్న వారికి వ్యాక్సిన్ వేస్తారు. ఈ దశ నుంచే వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా Co-WIN యాప్ ద్వారానే నడుస్తుంది. ఇందులో మొత్తంగా ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, వ్యాక్సినేషన్ మాడ్యూల్, బెనిఫిషియరీ అక్‌నాలెడ్జ్‌మెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్ ఉంటాయి. ఇందులోని రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ద్వారా వ్యాక్సినేషన్ కోసం రిజిస్టర్ చేసుకోవచ్చు. మొత్తంగా వ్యాక్సినేషన్ మొదటి విడతలో భాగంగా 30 కోట్ల మందికి వ్యాక్సిన్ వేస్తామని రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.



