ఉత్తరాఖండ్‌లో విజృంభిస్తోన్న మహమ్మారి.. తాజా అప్డేట్స్‌ ఇవే..

ఉత్తరాఖండ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు అక్కడ కేసుల సంఖ్య అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 438కి చేరింది. వీరిలో 79 మంది కోలుకోగా.. నలుగురు వ్యక్తులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు ఉత్తరాఖాండ్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. […]

ఉత్తరాఖండ్‌లో విజృంభిస్తోన్న మహమ్మారి.. తాజా అప్డేట్స్‌ ఇవే..

Edited By:

Updated on: May 27, 2020 | 6:12 PM

ఉత్తరాఖండ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మొన్నటి వరకు అక్కడ కేసుల సంఖ్య అత్యల్పంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కొద్ది రోజుల నుంచి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా బుధవారం నాడు కొత్తగా మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 438కి చేరింది. వీరిలో 79 మంది కోలుకోగా.. నలుగురు వ్యక్తులు కరోనా బారినపడి ప్రాణాలు కోల్పోయినట్లు ఉత్తరాఖాండ్‌ ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా, దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,51,767 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా…64,426 మంది కరోనా నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 83,004 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి 4,337 మంది ప్రాణాలు కోల్పోయారు.