ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా గురించి తెలిసిందే. ఇప్పటికే ఐదువేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. లక్షన్నరకు పైగా.. దీని బారినపడి చికిత్స పొందుతున్నారు. సామాన్య ప్రజానికాన్నే కాదు.. ఏకంగా సెలబ్రిటీలను, రాజకీయ నేతల్ని సైతం వణికిస్తోంది. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పలు దేశాల రాజకీయ నేతలు కూడా దీని బారిన పడ్డారు. తాజాగా అగ్రరాజ్య అధినేత డోనాల్డ్ ట్రంప్‌కు కూడా కరోనా భయం పట్టుకుంది. దీంతో వెంటనే ఆయన కరోనా టెస్టులు చేయించుకున్నారు. అయితే పరీక్షల్లో కరోనా వైరస్ నెగెటివ్ వచ్చినట్టు ఆయన వైద్యులు తెలిపారు.
అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ పరీక్షలు చేశామని.. తాజాగా బ్రెజిల్ ప్రతినిధుల టీం తన ఫ్లోరిడా రిసార్ట్‌కు వచ్చిన సమయంలో ట్రంప్ వారితో కలయదిరిగారు. అయితే ఈ టీంలో పలువురికి కరోనా సోకినట్లు తేలడంతో.. వెంటనే ట్రంప్‌కు కూడా చేసినట్లు తెలుస్తోంది.ట్రంప్‌కు చేసిన కరోనా పరీక్షలో నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని డాక్టర్ సీన్ కోన్లీ తెలిపారు.
కాగా.. కరోనా సోకి ఇప్పటికీ అమెరికాలో 51 మంది మరణించారు.. దీంతో లక్షలాది మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి.