Mandatory Face Mask, Social Distancing: దేశవ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మరోసారి కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభంలో పూర్తిస్థాయి లాక్ డౌన్ పుణ్యమాని అందరూ వర్క్ ఫ్రం హోం చేసేవారు. జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, క్రమేపీ ఆంక్షలు సడలించడం వల్ల వైరస్ వ్యాప్తి తీవ్రస్థాయిలో పెరిగింది. క్రమేపీ కార్యాలయాలు, మాల్స్, రెస్టారెంట్స్ తెరుచుకున్నాయి. దీంతో మరోసారి వైరస్ విస్తరిస్తోంది. దీంతో మరోమారు కొత్త నిబంధనలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా కొవిడ్ వ్యాప్తి కట్టడిలో ఉన్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. ఓ వైపు దేశంలో కరోనా రెండో దశ కేసులు క్రమపే పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు, దేశ వ్యాప్తంగా రెండో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. అయితే, కొన్ని రోజులుగా కేసుల పెరుగుదలలో కాస్త హెచ్చుతగ్గులు కనిపించినా.. గడిచిన 24 గంటల్లో 17,407 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలు కరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది.
State-wise details of Total Confirmed #COVID19 cases
(till 4th May, 2020, 08:00 AM)➡️States with 1-40 confirmed cases
➡️States with 41-700 confirmed cases
➡️States with 700+ confirmed cases
➡️Total no. of confirmed cases so farVia @MoHFW_INDIA pic.twitter.com/rw72l8ojXb
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) May 4, 2020
ప్రజలు ఎక్కువగా సందర్శించే షాపింగ్‌మాల్స్, రెస్టారంట్‌లు, ప్రార్థనా మందిరాలలో తప్పనిసరిగా మాస్క్‌లు ధరించి, భౌతికదూరం పాటించాలని కేంద్ర ప్రభుత్వం గురువారం ట్వీట్ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కరోనా ముందు జాగ్రత్తలకు సంబంధించిన చిత్రాలను ట్విటర్ ద్వారా పంచుకుంది. ఈ కొత్తగా ప్రకటించిన మార్గదర్శకాలు మార్చి 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కరోనా జాగ్రత్తలు పాటించేలా చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నిబంధనలు కచ్చితంగా పాటించేలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.
Read Also.. నివాస యోగ్య నగరాల్లో బెంగళూరు టాప్.. పది లక్షల లోపు నగరాల్లో కాకినాడకు స్థానం