క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ.10లక్షల జరిమానా

|

May 20, 2020 | 2:51 PM

కరోనా లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది ప్రభుత్వం. ఇళ్ల నుంచి బయటకు వచ్చి క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది.

క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే..రూ.10లక్షల జరిమానా
Follow us on

ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్..గల్ఫ్ దేశాలను గడగడలాడిస్తోంది. యూఏఈలో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజుకూ వందల సంఖ్యలో ప్రజలు కరోనా బారినపడుతున్నారు. మంగళవారం ఒక్కరోజే 873 కొత్త కేసులు నమోదైనట్లు అక్కడి వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో యూఏఈలో ఇప్పటి వరకు మొత్తం 25,063 మంది కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలోనే యూఏఈ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

కరోనా విజృంభిస్తుండటంతో యూఏఈ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాక్‌డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చి క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. అలాంటి వారికి 50వేల దిర్హామ్స్ ( రూ. 10,30,116) జరిమానా విధిస్తామని ప్రకటించింది. రెండోసారి అలాగే చేసి దొరికితే లక్ష దిర్హామ్స్‌తో పాటు 6 నెలల జైలుశిక్ష విధిస్తామని హెచ్చరించింది. కాగా, నిన్న‌ 1,214 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోలుకున్న వారి సంఖ్య 10,791 గా ఉందని అధికారులు తెలిపారు. అలాగే మంగ‌ళ‌వారం సంభ‌వించిన మూడు మ‌ర‌ణాల‌తో క‌లిపి దేశ‌వ్యాప్తంగా మొత్తం 227 మంది కోవిడ్ బారినపడి మరణించారు.