
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తీవ్రంగా విజృంభిస్తోన్నాయి. తాజాగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా వైరస్ బులిటెన్ రిలీజ్ చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌లో ఈరోజు కొత్తగా 44 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,671కి చేరింది. అలాగే ఈ వైరస్ నుంచి కోలుకుని 1848 మంది డిశ్చార్జి కాగా.. 767 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కాగా కరోనాతో మొత్తంగా 56 మంది మృతి చెందారు.
ఇక తెలంగాణ రాష్ట్రంలోనూ కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. కాగా తెలంగాణలో 10 రోజుల్లో ఏకంగా 19 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే ఈ నెల 15 నుంచి 25వ తేదీ మధ్య హైదరాబాద్‌లో 313 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ అంటే 24వ తేదీ ప్రకారం తెలంగాణలో 1854 కేసులు నమోదు కాగా.. 53 మంది మరణించారు. అలాగే ప్రస్తుతం 709 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా.. 1092 మంది కరోనాతో పోరాడి డిశ్చార్జ్ అయ్యారు.
Read More:
మరో 30 రోజుల్లో కరోనా కేసులు పది రెట్లు పెరిగే అవకాశం.. నిపుణుల వార్నింగ్
వరంగల్ మర్డర్ మిస్టరీ: 9 కాదు 10 హత్యలు.. బతికుండగానే.. చంపేశాడు
బలహీనపడ్డ భూ అయస్కాంత క్షేత్రం.. సెల్‌ఫోన్, శాటిలైట్లు పనిచేయకపోవచ్చు!
జబర్దస్త్ నటికి వేధింపులు.. అర్థరాత్రి నడిరోడ్డుపై బైక్ ఆపేసి అసభ్యకరమైన ప్రవర్తన..