రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గత కొన్ని నెలలుగా కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభించిన విషయం తెలిసిందే. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఓ రేంజ్‌లో నమోదు అయ్యేవి. అయితే గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కాస్త తగ్గిపోయాయి. కానీ ఒక్కో రోజు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయనికొస్తే రాష్ట్ర వ్యాప్తంగా.. గత 24 గంటల్లో కొత్తగా 9,652 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,06,261కు చేరింది. ఇందులో 85,130 యాక్టివ్ కేసులు ఉండగా.. 2,18,311 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 88 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 2820కు చేరింది.
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 445, చిత్తూరులో 990, తూర్పు గోదావరిలో 1396, గుంటూరులో 895, కడపలో 755, కృష్ణాలో 281, కర్నూలులో 830, నెల్లూరులో 684, ప్రకాశంలో 725, శ్రీకాకుళంలో 405, విశాఖలో 928, విజయనగరంలో 513, పశ్చిమ గోదావరిలో 805 కేసులు నమోదయ్యాయి.
ఇక తెలంగాణ విషయానికొస్తే.. కరోనా తీవ్రత కొనసాగుతోంది. కొత్తగా మరో 1763 మంది కరోనా బారిన పడ్డారు. 8 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం ఇప్పటివరకూ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 95,700కు చేరింది. అలాగే 719 మంది కోవిడ్ మహమ్మారి బారిన పడి మరణించారు. అలాగే ప్రస్తుతం 20,990 యాక్టీవ్ కేసులు ఉండగా, 73,991 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా డెత్ రేటు 0.75 శాతంగా ఉంది. దేశంలో ఇది 1.92 శాతంగా ఉందని గవర్నమెంట్ తెలిపింది. కాగా ఇప్పటి వరకు 7,97,470 కరోనా నిర్ధారణ టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read More: