Attack on Covid-19 Patient: మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో దారుణ సంఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు కలిసి కరోనా రోగిని చితకబాదారు. దీంతో ఆ ఇద్దరు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఈ సంఘటన ఖండ్వాలోని చైగావ్ మఖన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని సిర్సోడ్ బంజారీ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ షేర్ చేసి.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు పలువురు కూడా ఈ వీడియోపై స్పందించడంతో.. పోలీసులు దీనిపై స్పందించారు.
సిర్సోడ్ బంజరీ గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువకుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కరోనా రోగిని ఆసుపత్రికి తరలించేందుకు ఆరోగ్య సిబ్బంది అక్కడికి వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడారు. దీంతో కరోనా రోగి కుటుంబసభ్యులు అతిన్ని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. దీంతో ఆరోగ్య సిబ్బంది, వారి మధ్య మాటమాట పెరిగింది. రోగి బంధువులు సిబ్బందిపై దాడి చేశారు. అనంతరం బంధీగా ఉంచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఖండ్వాలోని కరోనా రోగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబసభ్యులను సముదాయిస్తున్న తరుణంలో రోగి కుటుంబం పోలీసులపై కూడా దాడి చేయడం ప్రారంభించిందని ఖండ్వా సుపరింటెండెంట్ వెల్లడించారు. దీంతో ప్రతీకారంగా కరోనా రోగితో పాటు అతని కుటుంబ సభ్యులను పోలీసులు కొట్టారని వెల్లడించారు.
मध्य प्रदेश के खंडवा जिले में पुलिकर्मियों ने कोरोना मरीज एवं महिला समेत उनके परिजनों पर लाठी-डंडों से बेरहमी से हमला किया। न्याय देने के बजाए पुलिस ने उल्टा पीड़ित परिवार पर ही केस दर्ज कर दिया। तत्काल इन पुलिसकर्मियों को निलंबित किया जाना चाहिए। ये बहुत ही पीड़ादायक है। pic.twitter.com/bKFK5UyTfN
— Chandra Shekhar Aazad (@BhimArmyChief) April 11, 2021
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా.. ఈ వీడియోలపై ఖండ్వా ఎస్పీ వివేక్ సింగ్ మాట్లాడుతూ.. కరోనా రోగిపై దాడి చేసిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. దీంతోపాటు ఆరోగ్య సిబ్బంది, పోలీసులపై దాడి చేసిన కరోనా రోగి కుటుంబసభ్యులపై కూడా కేసు నమోదు చేసినట్లు వివేక్ సింగ్ తెలిపారు. ఈఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. మధ్యప్రదేశ్‌లో కూడా కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు కఠిన ఆంక్షలను అమలు చేస్తోంది. అయినప్పటికీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ మేరకు పలు ప్రాంతాల్లో ఇప్పటికే నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.
Also Read: