హైదరాబాద్‌ రామాంతాపూర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని రామంతాపూర్ లో

హైదరాబాద్‌ రామాంతాపూర్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్

Updated on: May 30, 2020 | 5:12 PM

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకూ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లోని రామంతాపూర్ లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రామంతాపూర్ కామాక్షిపురంలో నివసించే ఓ వ్యాపారికి, సాఫ్ట్ వేర్ ఉద్యోగి భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇద్దరు కరోనా బాధితులను అధికారులు కింగ్ కోఠి ఆస్పత్రిలోని ఐసోలేషన్‌కు తరలించారు.

ఇదిలా ఉంటే, కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలి పోద్దంటున్నారు పలువురు నిపుణులు. అయితే, పలు జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనా వైరస్‌తో కలిసి జీవించాలని చెబుతున్నారు. అందులో భాగంగా ప్రజలు బయటకు వెళ్లినప్పుడు లేదా ప్రయాణం చేసేటప్పుడు భౌతిక దూరం పాటించాలి. కనీసం ఆరడుగుల దూరం పాటించాలి. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. మాస్క్‌లు తప్పని సరిగా వేసుకోవాలి. ఈ మూడు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా సోకే అవకాశం లేదని నిపుణులు సూచిస్తున్నారు.