భక్తులకు శుభవార్త.. శ్రీవారి సేవల బుకింగ్ డబ్బులు రీఫండ్..

|

May 25, 2020 | 12:44 PM

రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని రకాల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి, దర్శనం కోసం జూన్ 30 వరకు ఆన్లైన్, ఈ దర్శన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి భక్తులు తమ టికెట్ వివరాలతో పాటు బ్యాంక్ […]

భక్తులకు శుభవార్త.. శ్రీవారి సేవల బుకింగ్ డబ్బులు రీఫండ్..
Follow us on

రాష్ట్రంలో అమలవుతున్న నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు ఆలయ దర్శనాలను నిలిపేసిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని రకాల శ్రీవారి ఆర్జిత సేవలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆర్జిత సేవలు, వసతి, దర్శనం కోసం జూన్ 30 వరకు ఆన్లైన్, ఈ దర్శన్ కౌంటర్ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్ చేయనున్నట్లు ప్రకటించింది.

దీనికి భక్తులు తమ టికెట్ వివరాలతో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్, IFSC కోడ్ వివరాలను ఎక్సెల్ టెక్ట్స్‌లో టైప్ చేసి refunddesk_1@tirumala.orgమెయిల్ ఐడీకి పంపాలని సూచించింది. అలాగే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆన్ లైన్‌లో వీఐపీ దర్శనం టిక్కెట్లు పొందినవారు వాటిని రద్దు చేసుకోవడం కుదరదని.. దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాక.. దాతలు కోరిన తేదీలలో బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ పేర్కొంది. కాగా, తమిళనాడులోని 23 చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు దేవస్థానం టీటీడీ తాజాగా ఓ ప్రకటన జారీ చేసిన సంగతి విదితమే.