కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం

| Edited By:

Mar 26, 2020 | 6:57 AM

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ తెలంగాణలో విజృంభింస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో..

కరోనా విజృంభణ: టీఆర్ఎస్ నేతల కీలక నిర్ణయం.. రూ.500 కోట్ల విరాళం
Follow us on

కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకీ తెలంగాణలో విజృంభింస్తోంది. ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 40 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ వైరస్‌ని ఎదుర్కోడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుం బిగించారు. తమ వంతు సహాయంగా ఒక నెల వేతనం, ఒక ఏడాది నియోజక వర్గ అభివృద్ధికి నిధులు మొత్తం కలిపి దాదాపు రూ.500 కోట్ల రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్‌కి విరాళంగా అందించడానికి ముందుకు వచ్చారు. దాదాపు ఒక్కో ఎంపీ ఏడాదికి ఐదు కోట్ల రూపాయలను తమ నియోజక వర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరవుతాయి. ఈ ఏడాది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 16 మంది ఎంపీలకు మొత్తం 80 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి డొనేట్ చేయనున్నారు.

దీనికి సంబంధించి టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు, ఉప నాయకుడు బండ ప్రకాష్, లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వర రావు, ఉప నాయకుడు కొత్త ప్రభాకర్ రెడ్డి బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌కు లెటర్‌ను అందించారు. అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తన ఒక నెల జీతాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే వారికి ఏడాదికి విడుదలయ్యే నిధులను కూడా సీఎం సహాయ నిధికి డొనేట్ చేయనున్నట్లు టీఆర్ఎస్ శాసన సభా పక్షం ప్రకటించింది.

కాగా కరోనా వ్యాప్తి నివారణ కోసం చేపట్టే కార్యక్రమాలకు ఈ నిధులను వాడాలని వారు కోరారు. అయితే ఇంత స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు ప్రకటించిన నేతలను సీఎం కేసీఆర్ అభినందించారు. చట్టసభ సభ్యులు చూపించిన స్ఫూర్తి ప్రభుత్వానికి ఎంతో ఉత్సాహం ఇస్తుందన్నారు. అనే ప్రముఖులు ఆపద సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక సహాయం అందించడానికి ముందుకు రావడం గొప్ప విషయమని సీఎం అన్నారు. అలాగే.. రాజ్యసభ, లోక్‌ సభ సభ్యులు మరో నెల వేతనాన్ని ప్రధాన మంత్రి సహాయనిధికి అందిస్తారని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కే కేశవరావు ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: 

కరోనా ఎఫెక్ట్: పెరిగిన కండోమ్స్, ఐపిల్స్ సేల్స్

సీఎం సహాయ నిధికి.. విరాళంగా ఎంపీ బాలశౌరి రూ.4 కోట్లు

ఎక్కడైనా రేట్లు పెంచారా.. ఈ నెంబర్‌కి ఒక్క కాల్ చేస్తే.. తిక్క కుదురుస్తారు

కరోనా నివారణకు.. తెలంగాణలో స్టెరిలైజేషన్..

బాత్రూమ్ క్లీన్ చేస్తూ.. బట్టలు ఉతుకుతున్న క్రికెటర్

లాక్‌డౌన్ టైంలో బరువు పెరగకుండా ఇలా కేర్ తీసుకోండి..

వాట్సాప్ బంద్ కావడంలేదు.. ఆ ఫేక్ వార్తలను నమ్మకండి..