హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత కుటుంబం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. తాజాగా క‌విత ఇంట్లో ప‌ని చేసే ఓ డ్రైవ‌ర్‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ రావ‌డంతో వీరంద‌రినీ హోమ్ ఐసోలేష‌న్‌లో..

హోమ్ ఐసోలేష‌న్‌లో మాజీ ఎంపీ క‌విత కుటుంబం..

Edited By:

Updated on: Jul 24, 2020 | 9:40 AM

నిజామాబాద్ మాజీ ఎంపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్ కుమార్తె క‌ల్వ‌కుంట్ల కవిత కుటుంబం హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు. తాజాగా క‌విత ఇంట్లో ప‌ని చేసే ఓ డ్రైవ‌ర్‌కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ రావ‌డంతో వీరంద‌రినీ హోమ్ ఐసోలేష‌న్‌లో ఉంచారు అధికారులు. దీంతో వారం నుంచి ప‌ది రోజుల పాటు క‌విత కుటుంబం మొత్తం ఇంటికే ప‌రిమితం కానుంది. కాగా ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్ర‌జా ప్ర‌తినిధులు కోవిడ్ బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఇక మ‌రోవైపు రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేలు దాటింది.

కాగా గురువారం కొత్తగా 1,567 మందికి కరోనా సోకినట్లు తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఇవాళ నిన్న‌ బారినపడి తొమ్మిది మృతి చెందారు. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య 50,826కి చేరుకుంది. రాష్ట్రంలో కరోనా బారిన పడి ఇప్ప‌టివ‌ర‌కూ 447 మంది ప్రాణాలొదిలారు. తాజాగా గురువారం 1,661 మంది కోలుకుని డిశ్చార్జి కాగా, ఇప్పటివరకూ కోలుకుని 39,327 మంది డిశ్చార్జ్ అయ్యి ఇళ్లకు చేరుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,052 యాక్టివ్ కరోనా కేసులున్నాయని తెలంగాణ వైద్యారోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది.

Read More:

మ‌హారాష్ట్ర, జ‌మ్మూక‌శ్మీర్‌లో భూ ప్ర‌కంప‌న‌లు..

ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ టెర్ర‌ర్‌.. ఉధృతంగా కేసులు న‌మోదు..

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. విప‌రీతంగా పెరిగిపోతున్న కేసులు..