మొన్న పాల వ్యాన్..నేడు వాట‌ర్ ట్యాంక్‌..విద్యార్థుల లాక్‌డౌన్ క‌ష్టాలు

తెలంగాణకు చెందిన 20 మంది విద్యార్థులు మరఠ్వాడా ప్రాంతంలోని జల్నాలో అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మాసి కోర్సు చేస్తున్నారు. ..

మొన్న పాల వ్యాన్..నేడు వాట‌ర్ ట్యాంక్‌..విద్యార్థుల లాక్‌డౌన్ క‌ష్టాలు

Updated on: Apr 26, 2020 | 5:23 PM

లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఇత‌ర ప్రాంతాల్లో ఇరుక్కుపోయిన వారి క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతంగా మారాయి. రోజులు గ‌డుస్తున్నాకొద్దీ చేతిలో డ‌బ్బులు లేక‌, తినేందుకు తిండి దొర‌క్క నానా అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఎలాగైన త‌మ స్వ‌స్థ‌లాల‌కు చేరుకోవాల‌నే ఆరాటంతో దొరికిన ప్ర‌తి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాగే మొన్నామ‌ధ్య కొంద‌రు విద్యార్థులు రాజ‌స్థాన్ నుంచి పాల వ్యాన్‌లో బ‌య‌ల్దేరి ఏపికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నించి ప‌ట్టుబ‌డిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు కొంద‌రు తెలంగాణ విద్యార్థులు కూడా అదే మార్గంలో బ‌య‌ల్దేరారు.
తెలంగాణకు చెందిన 20 మంది విద్యార్థులు మరఠ్వాడా ప్రాంతంలోని జల్నాలో అగ్రిక‌ల్చ‌ర్ ఫార్మాసి కోర్సు చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ 20 మంది విద్యార్థులు తమ స్వస్థలాలకు రావాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఏ రవాణా సదుపాయం లేకపోవడంతో ఒక వాటార్ ట్యాంకర్ డ్రైవర్‌ను ఆశ్రయించారు. డ్రైవర్ తమ స్వస్థలాలకు చేర్చేందుకు ఒప్పుకోవడంతో ఖాళీ ట్యాంకర్‌లో విద్యార్థులంతా కూర్చోని బయలుదేరారు. దాదాపు 165 కిలోమీటర్లు ప్రయాణించారు. నాందేడ్ సమీపంలోకి రాగానే అక్కడి పోలీసులు ఆ ట్యాంకర్‌ను తనిఖీ చేయడతో వారంతా దొరికిపోయారు. అనంతరం ఆ 20 మంది విద్యార్థులను క్వారంటైన్‌కు తరలించారు.