ఏపీలో 44, తెలంగాణలో 18 రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్..

|

May 22, 2020 | 1:03 AM

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు జూన్ 1 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ నేపధ్యంలోనే గురువారం 10 గంటల నుంచి రైల్వేశాఖ ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే ఇప్పుడు ప్రయాణీకులకు మరింత వీలుగా శుక్రవారం నుంచి 73 రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య […]

ఏపీలో 44, తెలంగాణలో 18 రైల్వే కౌంటర్లలో టికెట్ బుకింగ్..
Follow us on

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్ 4.0లో కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభం కానుండగా.. స్పెషల్ ప్యాసింజర్ రైళ్లు జూన్ 1 నుంచి పట్టాలెక్కనున్నాయి. ఈ నేపధ్యంలోనే గురువారం 10 గంటల నుంచి రైల్వేశాఖ ఆన్లైన్ బుకింగ్ సౌకర్యాన్ని ప్రారంభించింది.

అయితే ఇప్పుడు ప్రయాణీకులకు మరింత వీలుగా శుక్రవారం నుంచి 73 రైల్వేస్టేషన్లలో రిజర్వేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైల్వే కౌంటర్లను అందుబాటులో ఉంచమని జోనల్ రైల్వేస్‌కు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆదేశించిన కొద్దిసేపటికే సౌత్ సెంట్రల్ రైల్వే నుంచి ఈ ప్రకటన విడుదలైంది. కాగా, ఏపీలో 44, తెలంగాణలో 18, మహారాష్ట్రలో 6, కర్ణాటకలో 5 రైల్వేస్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. ఇందులో ఇవాళ్టి నుంచి స్పెషల్ ట్రైన్స్‌కు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Read This: తెలంగాణ సర్కార్ సంచలనం.. పేదల కోసం 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం..