AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిల్లల ఆటలు చూస్తూ.. పాపం ! బుల్ డాగ్ విచారం

అట్లాంటాలో ‘బిగ్ పొప్పా’ అనే ముద్దు పేరు గల మూడేళ్ళ బొద్దుకుక్క.. బుల్ డాగ్ విచారంలో మునిగిపోయింది. కారణం ? తను రోజూ సరదాగా ఆడుకునే పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయలేకపోవడమే ! దీనికి కేరింతలు కొడుతూ ఆడుకునే చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని, ప్రతి రోజూ వాళ్ళతో ఆడుకుంటుందని దీని ఓనర్ రషీదా ఎల్లిస్ చెప్పారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. పాపం ఈ కుక్కగారిని వేరుగా పై అంతస్థులో ఉంచారు. ఆ అంతస్తులోని […]

పిల్లల ఆటలు చూస్తూ.. పాపం ! బుల్ డాగ్ విచారం
Umakanth Rao
| Edited By: |

Updated on: Apr 23, 2020 | 8:18 PM

Share

అట్లాంటాలో ‘బిగ్ పొప్పా’ అనే ముద్దు పేరు గల మూడేళ్ళ బొద్దుకుక్క.. బుల్ డాగ్ విచారంలో మునిగిపోయింది. కారణం ? తను రోజూ సరదాగా ఆడుకునే పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయలేకపోవడమే ! దీనికి కేరింతలు కొడుతూ ఆడుకునే చిన్న పిల్లలంటే ఎంతో ఇష్టమని, ప్రతి రోజూ వాళ్ళతో ఆడుకుంటుందని దీని ఓనర్ రషీదా ఎల్లిస్ చెప్పారు. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో.. పాపం ఈ కుక్కగారిని వేరుగా పై అంతస్థులో ఉంచారు. ఆ అంతస్తులోని కిటికీ అద్దాల గుండా కింద పిల్లలు ఆడుకోవడం చూసి తనకా అదృష్టం లేకపోయిందని దిగాలుగా కూచుండిపోయిందట. రషీదా  తన ట్విటర్ లో.. విషాదంలో మునిగిపోయిన ‘బిగ్ బొప్పా’ ఫోటోను, వీడియోను పోస్ట్ చేయగానే ఈ హార్ట్ బ్రేకింగ్ ‘దృశ్యాన్ని’ చూసి ఎంతోమంది చలించిపోయారు. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ మూవీ స్టార్ మైసీ విలియమ్స్ సహా అనేకమంది ఈ బుల్ డాగ్ స్థితి పట్ల విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. ఈ ఫోటో కమ్ వీడియోకి 64 వేల రీట్వీట్లు, 6 లక్షల లైక్స్ వచ్చాయట.