బ్రేకింగ్: మరో మూడు కరోనా కేసులు నమోదు

కేరళలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేరళలో.. కరోనా పాజిటివ్ కేసులు 24కి చేరాయి. ఈ సంఖ్య పెరగడంతో అటు అధికారులతో సహా, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం...

బ్రేకింగ్: మరో మూడు కరోనా కేసులు నమోదు

Edited By:

Updated on: Mar 16, 2020 | 9:17 PM

కేరళలో మరో 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేరళలో.. కరోనా పాజిటివ్ కేసులు 24కి చేరాయి. ఈ సంఖ్య పెరగడంతో అటు అధికారులతో సహా, ఇటు ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఆస్పత్రి ఐసోలేషన్‌లో 270 మంది అనుమానితులు చికిత్స పొందుతున్నారు. అలాగే హోం ఐసోలేషన్‌లో 12,470 మంది ఉండగా, ఈ రోజు కొత్తగా మరో 72 మంది అనుమానితులు ఆస్పత్రిలో చేరారు. కాగా.. ఈ విషయాన్ని కేరళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

అయితే ఇప్పటికే కేళర ముఖ్యమంత్రి పినరయి విజయన్.. ప్రజలను అప్రమత్తం చేస్తూ.. పలు సూచనలను, సలహాలను జారీ చేశారు. అలాగే థియేటర్లు, స్కూళ్లు, కాలేజీలని మూసివేశారు. ఆఫీసులకు కూడా తాళాలు వేసి.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు ఉద్యోగులు. కాగా.. ఆహార పదార్థాలు, నిత్యావసరాలను స్థానిక పంచాయతీ పర్యావేక్షణలో ఇంటింటికీ డెలివరీ చేయిస్తుంది. ఇతర రాష్ట్రాలకు ప్రయాణాలకు రద్దు చేయడమే కాకుండా.. అత్యవసరంగా బయట పనులపై వెళ్లే వారికి స్క్రీనింగ్ నిర్వహిస్తున్నారు. కాగా.. కరోనా భయం ఉన్నా.. ఇప్పటికీ ప్రజలు, ఆహారం, నీరు, ఇతర అవసరాల కోసం బయటకి వస్తున్నారు. దీంతో వాళ్లు ఇబ్బంది పడకుండా.. కరోనా ఎఫెక్ట్ పడకుండా.. కేరళ ప్రభుత్వం ఈ విధమైన నిర్ణయం తీసుకుంది.

అలాగే… సేవల్లో నాణ్యత పెంచేందుకు 24 గంటల కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. బ్రాడ్ బ్యాండ్‌లో క్వాలిటీ ఉండేలా చూస్తున్నారు. అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Read More this also: సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..

శ్రీలంకలో కరోనా వస్తే.. ఆరు నెలల జైలు శిక్షే

మీకు తెలుసా.. మనుషుల ఆరోగ్యం ‘పీతల’ రక్తంపై ఆధారపడి ఉందట!