మీకు తెలుసా.. మనుషుల ఆరోగ్యం ‘పీతల’ రక్తంపై ఆధారపడి ఉందట!

మనుషుల ఆరోగ్యం.. పీతల రక్తంపై ఆధారపడి ఉంటుందట. ఇదే విషయాన్ని సైనిటిస్టులు కూడా పేర్కొంటున్నారు. అయితే పీతల రక్తం నీలి రంగులో ఉంటుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా హార్స్ షూ పీతలు ప్రపంచంలోనే..

మీకు తెలుసా.. మనుషుల ఆరోగ్యం 'పీతల' రక్తంపై ఆధారపడి ఉందట!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 16, 2020 | 8:21 PM

మనుషుల ఆరోగ్యం.. పీతల రక్తంపై ఆధారపడి ఉంటుందట. ఇదే విషయాన్ని సైనిటిస్టులు కూడా పేర్కొంటున్నారు. అయితే పీతల రక్తం నీలి రంగులో ఉంటుందన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ముఖ్యంగా హార్స్ షూ పీతలు ప్రపంచంలోనే మనుగడలో ఉన్న అతి పురాతన జీవరాసులు. ఇవి 45 కోట్ల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉన్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అలాగే ఇవి అట్లాంటిక్, ఇండియన్, పసిఫిక్ సముద్ర ప్రాంతాలలో ఎక్కువగా కనిపిస్తాయి.

కాగా ముఖ్యంగా ఈ హార్స్ జాతికి చెందిన పీతల రక్తం.. వైద్య రంగంలో ఎక్కువగా ఉపయోగిస్తారట. అంటే మనుషులకు వాడే సూదులు, పలు వైద్య పరికరాల క్లీనింగ్‌ కోసం దీన్నే ఉపయోగిస్తారట. వైద్య పరికరాలపై హానికారక బాక్టీరియాని ఈ హార్స్ షూ రక్తం నాశనం చేస్తుంది. బాక్టీరియాల్లో ఉండే హానికారక పదార్థాలపై ఇది చాలా తీవ్రంగా పని చేస్తుంది. అలాగే మానవ శరీరంలోకి పంపించే టీకా మందులు, నరాల ద్వారా ఎక్కించే మందులు లేదా శరీరంలో అమర్చే ఇంప్లాంటెడ్ పరికరాలు.. కల్తీనో.. మంచివో తెలుసుకోవడానికి ఈ నీలి రంగు రక్తాన్నే ఉపయోగిస్తారట.

కాగా.. హార్స్ షూ పీతల రక్తం ప్రపంచంలోనే అతి ఖరీదైన ద్రవాల్లో ఒకటి. ఒక లీటర్ రక్తం సుమారు1500 డాలర్ల ఖరీదు చేస్తుందట. అలాగే ఈ రక్తం ఎలాంటి బ్యాక్టిరియానైనా క్షణాల్లో పసి గట్టగదలదట. కాగా.. ప్రస్తుతం వీటి మనుగడ చాలా తక్కువైంది. పెద్ద చేపల వేటలో ఇవి ఎక్కువగా మరణిస్తున్నాయి. అలాగే.. వైద్య రంగంలో ప్రస్తుతం వీటి కోసం ప్రత్యామ్నాయాల్ని వెతుకుతున్నట్టు పేర్కొంటున్నారు వైద్యులు.

Read More this also: సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!

రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..

శ్రీలంకలో కరోనా వస్తే.. ఆరు నెలల జైలు శిక్షే