Coronavirus: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది జాగ్రత్త.. రెండేళ్లనాటి పరిస్థితి తప్పదంటోన్న కేంద్ర ప్రభుత్వం.

|

Dec 20, 2022 | 7:48 PM

యావత్ ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త శాతించింది. వ్యాక్సిన్‌ ఉపయోగం పెరగడంతో భారీగా కేసుల సంఖ్య తగ్గాయి. అయితే తాజాగా కొత్త వేరియంట్లు మళ్లీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో..

Coronavirus: మహమ్మారి మళ్లీ వచ్చేస్తోంది జాగ్రత్త.. రెండేళ్లనాటి పరిస్థితి తప్పదంటోన్న కేంద్ర ప్రభుత్వం.
Corona Virus
Follow us on

యావత్ ప్రపంచాన్ని గజగజలాడించిన కరోనా మహమ్మారి ఇప్పుడిప్పుడే కాస్త శాతించింది. వ్యాక్సిన్‌ ఉపయోగం పెరగడంతో భారీగా కేసుల సంఖ్య తగ్గాయి. అయితే తాజాగా కొత్త వేరియంట్లు మళ్లీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా చైనాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచం మళ్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలను హెచ్చరిస్తోంది. కొత్త వేరియంట్లతో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కరానో కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్రం తెలిపింది. వారానికి ఏకంగా 35 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నట్లు తెలిపింది. ముఖ్యంగా చైనా, బ్రెజిల్‌, అమెరికా, కొరియా, జపాన్‌ దేశాల్లో భారీగా కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. లేకపోతే రెండేళ్ల నాటి పరిస్థితులు తప్పవని కేంద్ర ఆరోగ్యశాఖ హెచ్చరించింది.

దేశంలో కొత్తగా నమోదవుతోన్న కేసులను జినోమ్‌ సీక్వెన్సింగ్ చేయాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశించింది. జినోమ్‌ సీక్వెన్సింగ్‌తో కొత్త వేరియంట్లను సకాలంలో గుర్తించవచ్చని కేంద్రం తెలిపింది. ప్రజలు కూడా స్వీయ నిబంధనలు పాటించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..