
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్‌తో సినిమా రంగంపై భారీగా దెబ్బపడింది. చిన్న సినిమాల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్నీ కూడా సమస్యలు ఎదుర్కుంటున్నాయి. దీనితో మూవీ అనుకున్న సమయానికి విడుదల కాకపోతే కోట్లలో నష్టం వస్తుంది కాబట్టి.. చాలామంది నిర్మాతలు డిజిటల్ స్ట్రీమింగ్‌లలో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీబాంబ్‌ను డిస్నీ హట్‌స్టార్‌లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దీనికి మంచి డీల్ కూడా కుదిరిందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ‘మాస్టర్’ సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారట. దీనికి దళపతి విజయ్ కూడా సుముఖంగానే ఉన్నట్లు టాక్. అయితే అక్కడ థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తుందో అని చూస్తున్నారట. ఎందుకంటే రీసెంట్‌గా సూర్య తన నిర్మించిన ‘పొన్మగల్ వంధాల్’ అనే సినిమాను అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేయాలనీ భావించారు. దానికి తమిళనాడు థియేటర్ల యాజమాన్యం ఒప్పుకోకపోవడమే కాకుండా సూర్యకు డైరెక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే దళపతి విజయ్ నిర్ణయానికి వారు ఎలా రెస్పాండ్ అవుతారో అనేది ఆసక్తిగా మారింది.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..