Coronavirus: సెకండ్ వేవ్ టెర్రర్.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అమానుష ఘటనలు.. మరికొన్ని చోట్ల మానవీయ దృశ్యాలు

|

Apr 18, 2021 | 7:12 AM

రెండో దశ వైరస్‌ వేగంగా విస్తరిస్తూ పోతోంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ వణికించేలా చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌లో అమానుషం చోటుచేసుకుంది...

Coronavirus: సెకండ్ వేవ్ టెర్రర్.. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల అమానుష ఘటనలు.. మరికొన్ని చోట్ల మానవీయ దృశ్యాలు
Corona Virus
Follow us on

రెండో దశ వైరస్‌ వేగంగా విస్తరిస్తూ పోతోంది. ఈ క్రమంలో ప్రతీ ఒక్కరినీ వణికించేలా చేస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌లో అమానుషం చోటుచేసుకుంది. కరోనాతో మృతిచెందిన వ్యక్తి అంత్యక్రియలను దారుణంగా నిర్వహించారు. ట్రాక్టర్‌లో తరలించి.. ఖననం చేశారు. సంప్రదాయాలకు తిలోదకాలివ్వడమే కాదు.. కనీసం మృతదేహాన్ని చివరిసారిగా చూసుకునే అవకాశం కూడా కల్పించకపోవడంతో బాధిత కుటుంబం కన్నీటిపర్యంతమైంది. వైరస్‌ విస్తరిస్తుండడంతో మాస్క్‌ పెట్టుకోండని చెబుతుండగా.. మరోవైపు.. మాకే చెబుతావా అన్నట్టు నిజామాబాద్‌లో తండ్రీకొడుకులు రెచ్చిపోయారు. చెత్త తీసుకెళ్లేందుకు వచ్చిన మున్సిపల్ సిబ్బంది.. వారిని మాస్క్‌ పెట్టుకోమని చెప్పినందుకు  వారిపై దాడికి తెగబడ్డారు.

కరోనా విజృంభిస్తుండడంతో.. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఓ కాలనీ వాసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. స్వీయనిర్బంధంతో.. కరోనాను కట్టడి చేసేందుకు యత్నించారు. అందుకోసం మా ఇంటికి రాకండి.. మీ ఇంటికి రానివ్వకండి అంటూ ఫ్లెక్సీలను ఇంటి ముందు పెట్టి విజ్ఞప్తి చేస్తున్నారు. కరోనాతో ఆత్మస్థైర్యం కోల్పోతున్న వారు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఓ రోగి రైలు కింద పడి బలవన్మరణానికి ఒడిగట్టారు. కరోనాతో మృతిచెందిన వారిని తరలించేందుకు.. ఫీడ్‌ ద నీడ్‌ స్వచ్ఛంద సంస్థ సహకారంతో.. లాస్ట్‌ జర్నీ అనే అంబులెన్స్‌ను రాచకొండ సీపీ మహేష్‌భగవత్‌ ప్రారంభించారు. అంబులెన్స్‌ సేవల కోసం.. కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్ 9490617234, 7995404040 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలియజేసారు.

కృష్ణా జిల్లాలో సెకండ్‌ వేవ్‌ సెగ పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో అవనిగడ్డ సర్కిల్ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. పేర్లవానిలంకలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్‌కు అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఎవరూ ముందుకు కాకపోవడంతో.. పోలీసులకే ముందుండి.. కోవిడ్‌ నిబంధనల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కరోనా చికిత్స కోసం గుంటూరు జిల్లా అమృతలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లిన ఓ వివాహిత.. తీవ్ర ఆయాసానికి గురై ఆసుపత్రి మెట్ల మీదనే ప్రాణాలను వదిలింది.

Also Read: ఆ ఇంటి ముందు డోర్ పంజాబ్‌లో తెరుచుకుంటే.. వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటుంది

విశాఖ నరమేధంలో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. పోలీసుల విచారణలో కొత్త విషయాలు