
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం వెయ్యికి పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా శుక్రవారం నాడు కొత్తగా మరో 1,478 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 42,496కి చేరింది. ఇక శుక్రవారం నాడు కరోనా నుంచి కోలుకుని 1,410 మంది ఆస్పత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 28,705 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే నమోదవుతున్నాయి. శుక్రవారం నాడు..జీహెచ్‌ఎంసీ పరిధిలో 806 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డిలో 91, మేడ్చల్‌లో 82, సంగారెడ్డిలో 20, ఖమ్మం18, కామారెడ్డిలో 31, కరీంనగర్‌లో 77, జగిత్యాల 4, యాదాద్రి 11, మహబూబాబాద్ 19, పెద్దపల్లి 35, మెదక్ 23, మహబూబ్‌నగర్ 19, మంచిర్యాల 15, భద్రాద్రి 1, భూపాలపల్లి 2, నల్గొండ 35, సిరిసిల్ల 27, ఆసిఫాబాద్ 11, నారాయణపేట 14, వికారాబాద్ 17, నాగర్ కర్నూలు 23, జనగాం 10, నిజామాబాద్ 11, ములుగు 1, వనపర్తి 2, సిద్దిపేట 8, సూర్యపేట 20, జోగులాంబ గద్వాలలో 2 కేసులు నమోదయ్యాయి.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 17.07.2020) #TelanganaFightsCorona #StayHome #StaySafe
(1/3) pic.twitter.com/NbIuVfXq9f
— Eatala Rajender (@Eatala_Rajender) July 17, 2020