Telangana Coronavirus Cases: తెలంగాణలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 76,481 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 336 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,62,202కి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సాయంత్రం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఇక, 24 గంటల వ్యవధిలో కొత్తగా ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారినపడి మరణించినవారి సంఖ్య 3,898కు చేరింది. ఇక, ఒక్కరోజు వ్యవధిలో 306 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,53,022కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,282 యాక్టివ్ కేసులున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఇప్పటివరకు 2,55,79,757 నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించింది.
రాష్ట్రంలో వివిధ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి….