TS Corona Cases: తెలంగాణలో తగ్గుతున్న కరోనా వైరస్ ప్రభావం.. పెరిగిన మరణాల సంఖ్య.. కొత్త కేసులు ఎన్నంటే..?

కరోనా మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. నిత్యం 200 లోపు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి.

TS Corona Cases: తెలంగాణలో తగ్గుతున్న కరోనా వైరస్ ప్రభావం.. పెరిగిన మరణాల సంఖ్య.. కొత్త కేసులు ఎన్నంటే..?
Telangana Corona

Updated on: Oct 09, 2021 | 8:43 PM

Telangana Covid 19 Cases: కరోనా మహమ్మారి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతోంది. నిత్యం 200 లోపు పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 42,166 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 190 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,67,725కి చేరింది.

అయితే, కరోనా వైరస్ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలను కోల్పోయారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మృతుల సంఖ్య 3,929కి చేరింది. కాగా, కరోనా వైరస్ బారినుంచి నిన్న 245 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,288 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కాగా ఇప్పటి వరకు 6,59,508 మంది కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. మరోవైపు 2,67,56,608 నమూనాలను పరీక్షించినట్లు వైద్య శాఖ వెల్లడించింది.

Telangana Covid19

Read Also…  Black Eyed Beans: ఖాహారులకు సూపర్ ఫుడ్ అలసందలు.. చౌకగా దొరికే వీటిని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజలు ఎన్నో

Malware: మీ ఫోన్‌లో ఈ సిగ్నల్స్‌ కనిపిస్తున్నాయా.? అయితే వైరస్‌ ఉన్నట్లే. పరిష్కారం కోసం ఏం చేయాలంటే..

COVID-19: ప్రభుత్వ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. కోవిడ్ టీకా తీసుకోకుంటే కార్యాలయాలకు రావద్దు.. ఉత్తర్వులు జారీ!