తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భారీ వర్షాల కారణంగా గోదావరి లోతట్టు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. దీంతో వరంగల్ జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు సీఎం కేసీఆర్. అకస్మాత్తుగా వచ్చిన వరదలతో తీర ప్రాంతాలపై తీవ్రంగా ప్రభావం ఉన్నందున వరంగల్ జిల్లాకు టీఎస్ ప్రభుత్వం ఎన్టీఆర్ఎఫ్ బృందాన్ని పంపిందని అధికారిక వర్గాల సమాచారం. భారీ వర్షాలతో ప్రభుత్వం రైతులను, మత్స్యకారులను అప్రమత్తం చేసి, ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని కోరింది.
అలాగే రాష్ట్రంలోని లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. గోదావరి పరీవాహాక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది ప్రభుత్వం. కాగా ఝార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం క్రమ క్రమంగా బలహీనపడుతుంది. అలాగే 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూండటంతో.. రాబోయే 48 గంటల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
Read More:
ఈ రోజు నుంచి రేపల్లెలో పూర్తిస్థాయి లాక్‌డౌన్