బ్రేకింగ్: తెలంగాణలో జూనియర్ కాలేజీల రీ-ఓపెనింగ్ వాయిదా..

|

May 31, 2020 | 6:14 PM

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి మొదలు కావాల్సిన అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్- ఎయిడెడ్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీల రీ-ఓపెనింగ్‌ను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కాలేజీల పునః ప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం […]

బ్రేకింగ్: తెలంగాణలో జూనియర్ కాలేజీల రీ-ఓపెనింగ్ వాయిదా..
Follow us on

రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేపటి నుంచి మొదలు కావాల్సిన అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్- ఎయిడెడ్, ఎయిడెడ్, కాంపోజిట్ కాలేజీల రీ-ఓపెనింగ్‌ను వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా పరిస్థితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని.. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కాలేజీల పునః ప్రారంభ తేదీని వాయిదా వేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఇదిలా ఉంటే ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం శనివారం పూర్తయినట్లు తెలుస్తోంది. దీనితో రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు జూన్ 15న పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం అధికారులు స్కానింగ్ ప్రక్రియను కొనసాగిస్తుండగా.. దీని తర్వాత ఫలితాలు ప్రాసెస్ చేయాల్సి ఉంది. దీని బట్టి ముందుగా అనుకున్నట్లు ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు ఒకేసారి విడుదలయ్యే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే జూన్ 15న రెండో సంవత్సరం ఫలితాలను విడుదల చేసి.. ఆ తర్వాత రెండు మూడు రోజులకు ఫస్టియర్‌ ఎం,మార్క్స్ విడుదల చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలు వచ్చాక మొదటి సంవత్సరం తరగతులు.. అలాగే జూలై 15 తర్వాత రెండో సంవత్సరం తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.