తెలంగాణలోని వివిధ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులకు హైకోర్టు ‘కొవిడ్ నిధి’ని ప్రకటించింది. కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వైద్య అవసరాల కోసం మెడికల్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపింది. ప్రభుత్వం కల్పించే మెడికల్ రీయింబర్స్‌మెంట్ పథకం వర్తించదు కాబట్టీ ‘కొవిడ్ నిధి’ని ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించింది.
ఈ మేరకు ‘కొవిడ్ నిధి’కి విరాళాలు ఇచ్చేందుకు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు ముందుకొచ్చారు. రాష్ట్రంలో న్యాయాధికారులందరూ విరాళం ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానం కోరింది. మరోవైపు, రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ఆన్‌లైన్ పిటిషన్ల దాఖలు విధానాన్ని జులై 20 వరకు కొనసాగించాలని హైకోర్టు నిర్ణయించింది.