తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు రాజకీయ నాయకులు, సీనీ, క్రీడా ప్రముఖులు ఈ వైరస్ బారిన పడుతూనే ఉన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా కోవిడ్ మహమ్మారి ఎటాక్ చేస్తూనే ఉంది. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 55,999 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 627కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలో 463 పాజిటివ్ కేసులు, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, జోగులాంబ గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్ రూరల్‌లో 71, కామారెడ్డిలో 62, నల్గొండలో 59, నిజామాబాద్ లో 58, సిద్ధిపేటలో 55, కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Read More:
విజయవాడ హోటల్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా