Corona Updates: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజే 14 మరణాలు..!

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 154 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరింది.

Corona Updates: తెలంగాణలో భారీగా పెరిగిన కేసులు.. ఒక్కరోజే 14 మరణాలు..!

Edited By:

Updated on: Jun 07, 2020 | 10:02 PM

తెలంగాణలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 154 కేసులు నమోదు కాగా.. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,650కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 1742 మంది డిశ్చార్జి అవ్వగా.. 1771 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక ఇవాళ ఒక్క రోజే 14 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 137కి చేరింది. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో132 కేసులు ఉండగా.. రంగారెడ్డిలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, సిద్దిపేట, మహబూబాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, కరీంనగర్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.

అటు ఏపీలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3718కి చేరింది. వీరిలో 2353 మంది కరోనాను జయించగా.. ప్రస్తుతం 1290 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా వలన రాష్ట్రంలో 75 మంది మరణించారు. ఇదిలా ఉంటే లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సోమవారం నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపులు లభించిన విషయం తెలిసిందే.

Read This Story Also: కరోనా విజృంభణ.. తెలంగాణ వైద్యారోగ్య శాఖ కీలక నిర్ణయం.!