Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 158.. దేశంలో కూడా ప్రమాదకరంగా కేసులు

|

Mar 07, 2021 | 11:08 AM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగతుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 158 మందికి వైరస్ సోకినట్లు తేలింది.

Telangana Corona: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా వ్యాప్తి.. కొత్తగా 158.. దేశంలో కూడా ప్రమాదకరంగా కేసులు
Corona Cases Telangana
Follow us on

Telangana Corona:  తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగతుంది. శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 158 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,742కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ రిలీజ్ చేసింది. రాష్ట్రంలో శనివారం మహమ్మారి కారణంగా ఒకరు ప్రాణాలు విడవగా… తెలంగాణలో మొత్తం కోవిడ్-19 మృతుల సంఖ్య 1641కి చేరినట్టు వెల్లడించింది. కాగా వ్యాధి బారి నుంచి గత 24 గంటల్లో మరో 207 మంది కోలుకున్నారని తెలిపింది.
దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2,96,166కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,886 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వారిలో 748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా మరో 30 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీ తర్వాత అత్యధికంగా రంగారెడ్డి 15, మేడ్చల్ మల్కాజ్‌గిరిలో 10, కరీంనగర్ 8, మహబూబ్‌నగర్ 6, ఆదిలాబాద్ 6 కేసులు నమోదయ్యాయి.

గడచిన 24 గంటల్లో మొత్తం 40,616 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 158 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. మరో 628 మంది ఫలితాలు రావాల్సి ఉంది. తాజా పరీక్షలతో తెలంగాణలో మొత్తం 89,64,623 నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వివరించింది.

మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మరోసారి ప్రమాదకరంగా మారుతున్నాయి. గడచిన 24 గంటల్లో 18,711 మందికి వైరస్ పాజిటివ్ అని తేలగా.. 100 మంది మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,12,10,597కి చేరింది. మొత్తం మరణాలు 1,57,795కి చేరుకున్నాయి. ఇప్పటి వరకు 108,66,554 మంది కోలుకోగా.. 1,81,642 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అత్యధికంగా శనివారం మహారాష్ట్రలో 10,187 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఇక కేరళలోనూ కరోనా కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నాయి. మరోసారి కేసులు తీవ్రత పెరుగుతున్న క్రమంలో అశ్రద్ద చేయకుండా.. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Also Read:

ఈ పంట వేస్తే.. సిరుల పంట.. 1 ఎకరంలో సాగు చేస్తే 30 కోట్లు… సాగు విధానం సహా పూర్తి వివరాలు

Balayya slaps fan: మరోసారి అభిమానిపై చేయి చేసుకున్న బాలయ్య.. హిందూపురంలో సేమ్ సీన్ రిపీట్