Telangana Corona Updates: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో అధికం..

|

Jan 11, 2022 | 8:20 PM

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,153 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1920 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్..

Telangana Corona Updates: తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు.. ఆ రెండు జిల్లాల్లో అధికం..
Corona
Follow us on

Telangana Covid 19 Cases: తెలంగాణలో కరోనా (Telangana Covid 19 Cases) వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 83,153 శాంపిల్స్ టెస్ట్ చేయగా 1920 మందికి వైరస్ సోకినట్లు తేలింది. ఫలితంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,97,775కి చేరింది. కరోనా కారణంగా 2 మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 4,045కి చేరింది. కొత్తగా 24 గంటల వ్యవధిలో417 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. కొత్తగా కోలుకున్నవారితో కలిపి రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 6,77,234కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 16,496 యాక్టివ్ కేసులున్నాయి. నేటివరకు రాష్ట్రంలో 3,02,77,738  శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.  కాగా కొత్తగా నమోదైన కేసుల్లో.. జీహెచ్ఎంసీ పరిధిలోనే1015,రంగారెడ్డి159,మేడ్చెల్ 205 కేసులు నమోదయ్యాయి.

ఇదిలావుంటే.. దేశవ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.  సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 1,68,063 మంది వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. కరోనా వల్ల మరో 277మంది ప్రాణాలు విడిచారు. మరో 69,959 మంది వ్యాధి బారి నుంచి కోలుకున్నారు. కాగా దేశంలో కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 10.64 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది

  • దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు: 3,58,75,790
  • దేశంలో మొత్తం మరణాలు: 4,84,213
  • దేశంలో ప్రజంట్ యాక్టివ్ కేసులు: 7,23,619
  • మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారు: 3,45,70,131

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు బూస్టర్ డోస్ ఇస్తున్నారు.  సోమవారం ఒక్కరోజే 92,07,700 డోసులు అందించారు. ఫలితంగా ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,52,89,70,294కు చేరింది.  దేశంలో ఒమిక్రాన్​ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 4,461 ఒమిక్రాన్ కేసులు గుర్తించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కానప్పటికీ.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి: Punjab Assembly Election 2022: వీటి చుట్టే తిరుగుతున్న పంజాబ్ ఎన్నికలు.. ఆశలన్నీ కింగ్ మేకర్‌పైనే..

Flamingos: ఫ్లెమింగోలు ఒంటికాలి జపం ఎందుకు చేస్తాయో తెలుసా.. దీని వెనుక ఓ సైన్స్..